మనసుకు ఆహ్లదాన్నిచ్చే నల్లమల్ల అరణ్యంలొ పకృతి అందాల మద్య ఉన్న పాలంక క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా విరజిల్లుతొంది...'ఏటా తొలి ఏకాదశి పర్వదినాన మూడురొజుల పాటు స్వామివారికి పూజలు చేస్తారు...ఈ క్షేత్రం ఎన్నో వింతలు వినోదాలకు నెలవు. అటువంటి పాలంక వీరభద్ర స్వామి వార్షిక తిరునాళ్ళు ఫైప్రత్యేక కధనం ప్రకాశం జిల్లా "యర్రగొండపాలెం" మండలం నల్లమల అడవులలో పాలంక లోయలో వీరభదృడు కొండ చరయల కింద గుహలో కొలువైయ్యాడు... ప్రతి సవత్సరం...తొలి ఏకాదశిని పురస్కరించుకొని..వైభవం గా తిరునాళ్ళు చేస్తారు...ఈ ఆలయం నల్లమల్ల లొ కోలువై ఉండండంతో సరైన మార్గంలేదు.. వివిద జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు యర్రగొండపాలెం చేరుకుంటారు. అక్కడి నుండి లారిలు, ట్రాక్టర్ ల ద్వారా ముందురోజు బయలు దేరి .. పాలంక కొండ వద్దకు భక్తులు చేరుకొంటారు...అక్కడ నుండి కిందకు భక్తులు కాలినడకన ఆలయం వద్దకు చేరుకుంటారు..ఆలయం ముందు చుక్కల పర్వతం శివుని మందు నందిలా తలపిస్తుంది. దాదాపు 200 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే జలపాతం ఇక్కడి అందాలను మరింత పెంచుతుంది...ఆ నీరు పడే ప్రాంతాన్ని పుష్పగుండం అంటారు... ..పిల్లలు లేని దంపతులు గుండంలొ స్నానమాచరించి దీనికింద కూర్చూంటే అరిచేతిలొ నీటి బిందువులు పడతాయి..ఇలా పడ్డవారకి సంతానం కలుగుతుందని నమ్మకం..ఇక్కడికి వచ్చిన తరువాత పిల్లలుపుట్టిన వారు తమ సంతానానికి పాలంక వీరయ్య, పాలంకయ్య, భద్రయ్య, భద్రమ్మ వంటి పేర్లు పెడతారు..దీంతొ 'ఫలవంక' కాలక్రమంలొ ,పాలంక గా పిలువబడుతొంది.... ఎక్కువగా ప్రకాశం ,గుంటూరు ,మహబూబ్‌నగర్ జిల్లాలొ ఈ పేర్లు తొ వందల మంది కనిపిస్తారు..అషేశ సంఖ్యలో చేరుకున్నభక్తులకు బోడా, నలగాటి వంశస్థుల, చెంచుల ఆద్వర్యంలొ అన్నదానము నిర్వహిస్తారు..దక్షయజ్ఞం ధ్వంసం చేశాక స్వామి వారి వెంట రౌద్రరూపంలొ వెళ్తున్న వీరభద్రుడు పాలంకలొని ప్రకృతి అందాలకు పరవశించి రౌద్రరూపం వీడి ఇక్కడ కొండ చరియల కింద గుహలో కొలువయ్యాడని.. స్వామి వారిని వెతుక్కుంటూ వచ్చిన గణపతి,శివుడు ,బ్రహ్మ ,సుబ్రహ్మణ్య, భద్రకాళి , కనకదుర్గ కూడా ఇక్కడ వెలిసినట్లు చెబుతారు.
శ్రీకృష్ణ దేవరాయల సైన్యం శ్రీశైలానికి కాపలా వెళ్ళడానికి ముందు స్వామిని ఆరాధించి వెళ్లేవారు
పగలు వన్య మృగాలు ,రాత్రి వేళ దేవతలు, నాగులు, యక్షులు, గంధర్వులతో పూజలందుకుంటాడని ..క్షేత్ర వైభవం గురించి ఒగ్గుకధ, కొలాటల్లొ భక్తులు పాడుకుంటారు..కొండ పై నుంచి చూస్తే ఈ క్షేత్రం విచ్చుకున్న పుష్పం ఆకారంలొ ఉంటుంది.. పుష్ప గుండం వద్ద దక్షిణం వైపు తల, ఉత్తరం వైపు కాళ్లు పెట్టి పడుకుంటే పైన ఆకాశం శంఖం ఆకారంలొ కనిపిస్తుంది ..స్వామివారి ఆలయం ఎదురుగా ఉండే 'పచ్చపాలంక' కొండగుహలొ సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పౌర్ణమి రోజు దగ్గరలోని 'తెట్టసరి' నుంచి బయలుదేరి పచ్చపాలంక గుహ దగ్గర అదృశ్యమవుతుందని చెబుతారు...ఈ గుహ దగ్గరకు వెళ్తే సముద్రపు ఘోషతొ కూడిన ఓంకార శబ్దం వినిపిస్తుంది..అద్బుతమైన వనమూలికల సువాసన వస్తుంది .. ఈ ఆలయ ప్రత్యేకతలు భక్తులు చెపుకుంటారు....పాలంక వీరభద్రుని దర్శించిన భక్తులు తన్మయంతో అలౌకిక ఆనందం చెందుతూ.. తమ కోరికలు తీర్చమంటూ మొక్కులు మోక్కుతూ తీర్థప్రసాదాలు అందుకుంటారు.
నూకల హరికృష్ణ శర్మ
సంతానం
లేని దంపతులు శివలింగం పైన చేయిపట్టుకుంటే పైనుండి నీటి బిందువులు పడతాయి.
అర చేయి మధ్యలో పడితే తొందరగా కలుగుతుంది పక్కన పడితే ఆలస్యం అవుతుంది అని
భక్తుల విశ్వాసం.
సంతానం
లేని దంపతులు శివలింగం పైన చేయిపట్టుకుంటే పైనుండి నీటి బిందువులు పడతాయి.
అర చేయి మధ్యలో పడితే తొందరగా కలుగుతుంది పక్కన పడితే ఆలస్యం అవుతుంది అని
భక్తుల విశ్వాసం.
నూకల హరికృష్ణ శర్మ