వినాయకుని ప్రార్ధనలు ఇన్నీ అన్నీ అని చెప్పజాలము. ప్రతి పనికీ, రచనకూ ముందు వినాయకుని ప్రార్ధించడం ఆనవాయితీ గనుక దాదాపు ఎన్ని పద్యకావ్యాలున్నాయో అన్ని ప్రార్ధనా పద్యాలున్నాయి. ఇక సంప్రదాయ శ్లోకాలు సరేసరి. కాని తెలుగువారికి అత్యంత పరిచయమున్న పద్యమిది.
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్.
మరొక పద్యం కూడా విద్యార్ధులకు ఉచితమైనది.
తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!
శుక్లాంబరధరం విష్ణుం
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను (ధ్యానిస్తున్నాను)
అగజానన పద్మార్కం గజాననమ్ అహర్నిశం
అనేకదమ్ తమ్ భక్తానాం ఏకదంతమ్ ఉపాస్మహే
(అగజ)పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను.
ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్ధనా శ్లోకము
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యన జాయతే

2 comments:
🕉️🕉️ *హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్. [Courtesy : Dondla Rama Moorthy]హరిః ఓమ్*.🕉️
🔴*ఈ పద్యం శ్రీ విఘ్నేశుని (గణేశుని) ప్రార్థనా పద్యాలలో చాలా ప్రసిద్ధమైనది. పూర్తి పద్యం మరియు దాని భావం క్రింద ⬇️ఇవ్వబడింది:
[1]
(http://harikotagiri.blogspot.com/2011/07/blog-post_3982.html)
▪️*పద్యం*⬇️:
🔸*తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయైయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్!*.
[1]
(https://www.facebook.com/groups/hindutemplesguide/posts/9120570534655263/)
🔸*ఇది ⬆️ వినాయక చవితి పూజలలో, మరియు ఏ శుభకార్యం ప్రారంభిం చినా ముందుగా చదువు కునే సుప్రసిద్ధ ప్రార్థనా పద్యం*.
🔸*చిన్న పిల్లలు - విద్యా ర్థులు - విఘ్నేశ్వరుణ్ణి బాగా ప్ర్రార్ధిస్తే - పుస్తకాలు అన్నిం టికీ పసుపు వ్రాసి -ఓంకారం 🕉️వ్రాసి సాష్టాంగ నమ స్కారం చేస్తే - అన్ని విద్యల కు గురువై వున్న గణపతి మిమ్మల్ని దీవిస్తాడు. 21 పత్త్రిలు పెట్టి బాగా పూజిం చండి. దీవిస్తాడు. పిల్లలు విద్యల్లో రాణిస్తారు*.
[1]
(http://devotionalstoyou.blogspot.com/p/lord-vinayaka-songs-with-lyrics.html)
[2]
(http://harikotagiri.blogspot.com/2011/07/blog-post_3982.html)
హరిః ఓమ్. హరిః ఓమ్.హరిః ఓమ్.
🕉️🕉️ హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్. 🕉️🕉️
Post a Comment