Thursday, 28 July 2011

భరత మాత

0 comments
కొమ్మల మీది కోయిలలుకుత్తుకలెత్తి  స్వతంత్ర  భావ సూ త్రమ్ముల కట్టసాగి  మమతన్ ప్రణయాంబర చిత్రశాలలున్కమ్మని జీవితానుభవగాథలు స్వాదుకథాపదేశామార్గమ్ములు కర్ణరంజకముగా వినిపించెడు నేడు భార...
Read more...

Thursday, 7 July 2011

పుష్ప విలాపం

2 comments
కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి చే విరచించబడి, ఘంటసాల వేంకటేశ్వర రావు గారి చే గానం చేయబడిన ఈ పుష్ప విలాపం నాకెంతో ఇష్టమైనది.... చేతులారంగ నిన్ను పూజించుకొరకు కోడి కూయంగనే మేలుకొంటి నేను; గంగలో ముంగి ధౌత వల్కలము గట్టి పూలు కొనితేర నరిగితి పుష్పవనికి నేనొక పూలమొక్కకడ నిల్చి చివాలున కొమ్మవంచి గో రానెడునంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా ప్రాణము దీతువా?" యనుచు బావురు మన్నవి - కౄంగిపోతి, నా మానసమందెదో తళుకు మన్నది "పుష్పవిలాప" కావ్యమై. తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి అమ్ముకొందువె మోక్షవిత్తమ్ము కొరకు! హౄదయమే లేని నీ పూజ లెందుకోయి? జడమతుల...
Read more...

Wednesday, 6 July 2011

వినాయకుడి ప్రార్ధనలు

0 comments
వినాయకుని ప్రార్ధనలు ఇన్నీ అన్నీ అని చెప్పజాలము. ప్రతి పనికీ, రచనకూ ముందు వినాయకుని ప్రార్ధించడం ఆనవాయితీ గనుక దాదాపు ఎన్ని పద్యకావ్యాలున్నాయో అన్ని ప్రార్ధనా పద్యాలున్నాయి. ఇక సంప్రదాయ శ్లోకాలు సరేసరి. కాని తెలుగువారికి అత్యంత పరిచయమున్న పద్యమిది. తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌. కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌. మరొక పద్యం కూడా విద్యార్ధులకు ఉచితమైనది. తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా వలపటి చేతి...
Read more...

అన్నమయ్య కీర్తనలు, రచనలు

0 comments
సుప్రసిద్ధ తెలుగు కవి పండితుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో చెప్పాలంటే "అన్నమయ్య రచనలు ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిధ్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన దివిపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే." అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము,...
Read more...

భారత మాత

0 comments
దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. దేశాన్ని మాతగా కీర్తిస్తూ, లయాన్వితింగా సాగిపోయే ఈ గేయం అప్పుడూ ఇప్పుడూ ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఈ గీతాన్ని కాకినాద ప్రభుత్వ కళాశాలలొ లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు వారి విద్యార్దులకోసం కృష్ణశాస్త్రి వ్రాసారు.   జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి! జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి! జయ జయ జయ..... జయ జయ సశ్యామల సుశ్యామల...
Read more...