Thursday, 28 July 2011

భరత మాత

0 comments

కొమ్మల మీది కోయిలలు
కుత్తుకలెత్తి  స్వతంత్ర  భావ సూ 
త్రమ్ముల కట్టసాగి  మమ
తన్ ప్రణయాంబర చిత్రశాలలున్
కమ్మని జీవితానుభవ
గాథలు స్వాదుకథాపదేశామా
ర్గమ్ములు కర్ణరంజకము
గా వినిపించెడు నేడు భారతీ!
Read more...

Thursday, 7 July 2011

పుష్ప విలాపం

2 comments
కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి చే విరచించబడి, ఘంటసాల వేంకటేశ్వర రావు గారి చే గానం చేయబడిన ఈ పుష్ప విలాపం నాకెంతో ఇష్టమైనది....

చేతులారంగ నిన్ను పూజించుకొరకు
కోడి కూయంగనే మేలుకొంటి నేను;
గంగలో ముంగి ధౌత వల్కలము గట్టి
పూలు కొనితేర నరిగితి పుష్పవనికి

నేనొక పూలమొక్కకడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడునంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము దీతువా?" యనుచు బావురు మన్నవి - కౄంగిపోతి, నా
మానసమందెదో తళుకు మన్నది "పుష్పవిలాప" కావ్యమై.

తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
అమ్ముకొందువె మోక్షవిత్తమ్ము కొరకు!
హౄదయమే లేని నీ పూజ లెందుకోయి?

జడమతుల మేము; ఞానవంతుడవు నీవు;
బుధ్ధి యున్నది; భావ సమౄద్ధి గలదు;
బండబారెనటోయి నీ గుండెకాయ!
శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు?

ఆయువు గల్గు నాల్గు గడియల్ కనిపెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తు ము; తదీయ కర్మ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివ్రేళ్ళపై.

గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భౄం
గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ముబోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధబుద్ధితో
ట్ళుము త్రుంపబోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!

ఆత్మసుఖమ్ము కోసమయి అన్యుల గొంతులు కోసి తెచ్చు పు
ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతిపూజ వి
శ్వాత్ముడు స్వీకరించునె? చరాచరవర్తి ప్రభుండు మా పవి
త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్?

ఊలుదారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేనివారు మీ యాడువారు

గుండెతడి లేక నూనెలో వండి పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను
కంపు దేహాలపై గుమాయింపు కొరకు
పులుముకొందురు హంత! మీ కొలము వారు.

అక్కట! హాయి మేము మహిషాసురు లెందరొ నాల్గు ప్రక్కలన్
ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడుకాళ్ళతో
ద్రొక్కుచు దొర్లి - దొర్లి - మరురో జుద్యాననె వాడి వత్తలై
రెక్కలు జారిపోన్ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బపై.

మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కౄశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !

బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.

పూజ లేకున్న బాబు నీ పున్నె మాయె!
కోయబోకుము మా పేద కుత్తుకలను
అకట! చేసేత మమ్ముల హత్యచేసి
బాపుకొనబోవు ఆ మహాభాగ్య మేమి?

ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టి
నట్లుగాన్ - పూలు కోయ చేయాడలేదు;
ఏమి తోచక దేవర కెరుక సేయ
వట్టి చేతులతో ఇటు వచ్చినాను.
Read more...

Wednesday, 6 July 2011

వినాయకుడి ప్రార్ధనలు

0 comments
వినాయకుని ప్రార్ధనలు ఇన్నీ అన్నీ అని చెప్పజాలము. ప్రతి పనికీ, రచనకూ ముందు వినాయకుని ప్రార్ధించడం ఆనవాయితీ గనుక దాదాపు ఎన్ని పద్యకావ్యాలున్నాయో అన్ని ప్రార్ధనా పద్యాలున్నాయి. ఇక సంప్రదాయ శ్లోకాలు సరేసరి. కాని తెలుగువారికి అత్యంత పరిచయమున్న పద్యమిది.

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌.


మరొక పద్యం కూడా విద్యార్ధులకు ఉచితమైనది.

తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!శుక్లాంబరధరం విష్ణుం


శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే


తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను (ధ్యానిస్తున్నాను)

అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం
అనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే


(అగజ)పార్వతి ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను.


ఇక వినాయకుని 16 పేర్లతో కూడిన ప్రార్ధనా శ్లోకము


సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యన జాయతే
Read more...

అన్నమయ్య కీర్తనలు, రచనలు

0 comments


సుప్రసిద్ధ తెలుగు కవి పండితుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో చెప్పాలంటే "అన్నమయ్య రచనలు ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిధ్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన దివిపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే."


అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.


ఉదాహరణలు
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడగల మయము॥


అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥


చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మ మయము॥


కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకల సంపద రూప మదివో
పావనముల కెల్ల పావన మయము॥
Read more...

భారత మాత

0 comments
దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. దేశాన్ని మాతగా కీర్తిస్తూ, లయాన్వితింగా సాగిపోయే ఈ గేయం అప్పుడూ ఇప్పుడూ ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఈ గీతాన్ని కాకినాద ప్రభుత్వ కళాశాలలొ లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు వారి విద్యార్దులకోసం కృష్ణశాస్త్రి వ్రాసారు.
 

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి!
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి!


జయ జయ జయ.....


జయ జయ సశ్యామల సుశ్యామల చలచ్చేలాంచల!
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల!
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా!


జయ జయ జయ.......


జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ!
జయ గాయక వైతాళిక గళవిశాల పథవిహరణ!
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ!


జయ జయ జయ.......
Read more...