Saturday, 30 June 2012

సూర్యాష్టకం

0 comments

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం

శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

బృంహితం తేజసాం పుంజం వాయు రాకాశ మేవ చ
ప్రభుస్త్వం సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం

బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

తం సూర్యం జగతాం నాధం జ్ఞాన ప్రకాశ మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని యే త్యజంతి రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి

ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం
Read more...

శ్రీమచ్చంకరాచార్య కృత శివమానస పూజ:

1 comments

౧.రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం

జాతీచంపకబిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా

దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం!

౨.సౌవర్ణే మణిరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభా ఫలం పానకం
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు!

౩.ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగకాహళకలా గీతం చ నృత్యం తథా
సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధాః ఏతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో!

౪.ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ రచనా నిద్రాసమాధి స్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో! తవారాధనమ్!

౫.కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం
విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో!
Read more...

ప్రాతఃస్మరణ శ్లోకములు - ఆది శంకరాచార్య

0 comments

ప్రాతః స్మరామి హృదిసంస్ఫురదాతమతత్వం!
సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయమ్!
యత్స్వప్నజాగర సుషుప్తమవైతి నిత్యం!
తత్బ్రహ్మ నిష్కల్మహం న చభూతసంఘః!!

సచ్చిదానందరూపము, మహాయోగులకు శరణ్యం, మోక్షమునిచ్చునదీ అగు ప్రకాశవంతమైన ఆత్మ తత్త్వమును ప్రాతఃకాలమునందు నా మదిలో స్మరించుచున్నాను. ఏ బ్రహ్మ స్వరూపము స్వప్నమూ, జాగరణ, సుషుప్తి అను వాటిని తెలుసుకొనుచున్నదో నిత్యమూ భేదము లేనిదీ అగు బ్రహ్మను నేనే. నేను పంచ భూతముల సముదాయము కాదు.

ప్రాతర్భజామి చ మనోవచసామగమ్యం!
వాచోవిభాన్తి నిఖిలా యదనుగ్రహేణ!
యం నేతి నేతి వచనైహ్ నిగమా అవోచు!
స్తం దేవ దేవమజ మచ్యుతమాహురగ్ర్యం!!

మనస్సుకు, మాటలకు, అందని ఆ పరబ్రహ్మను ప్రాతఃకాలమునందు సేవించుచున్నాను. ఆయన అనుగ్రహము వల్లనే సమస్త వాక్కులు వెలుగొందుచున్నవి. వేదములు నేతి నేతి (ఇది కాదు ఇది కాదు) వచనములచే ఏ దేవుని గురించి చెప్పుచున్నవో, జనన మరణము లేని ఆ దేవ దేవునే అన్నిటికంటే గొప్ప వాడుగా పండితులు చెప్పారు.

ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం!
పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యాం!
యస్మిన్నిదం జగదశేషమశేష మూర్తౌ!
రజ్జ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై!!

అజ్ఞానాంధకారము కంటే వేరుగా సూర్యుని వలే ప్రకాశించు పూర్ణ స్వరూపుడు, సనాతనుడు, అగు పురుషోత్తముని ప్రాతః కాలమునందు నమస్కరించుచున్నాను.అనంత స్వరూపుడగు ఆయన యందే ఈ జగత్తంతయూ తాడులో సర్పము వలే కనపడుచున్నది.

శ్లోకత్రయమిదం పుణ్యం లోకోత్రయ విభూషణం!
ప్రాతః కాలే పటేద్యస్తు సగత్సేత్పరమం పదం!!

మూడూ లోకములను అలంకరించునవి, పుణ్యకరములు అగు ఈ శ్లోకములను ఎవరైతే ప్రాతః కాలమునందు పటించునో వారు మోక్షమును పొందును.

Read more...

మాతృపంచక శ్లోకములు:

4 comments

౧. ముక్తామణిస్త్వం నయనం నమేతి రాజేతి జీవేతి చిరం సుత త్వం!
ఇతి ఉక్తవత్యాః తవవాచి మాతః దదామ్యాహం తండులమేవ శుష్కమ్!!

'నువ్వు నా ముత్యానివి, నా రత్నానివి, నా కంటి వేలుగువు, కుమారా! నువ్వు చిరంజీవివై వర్ధిల్లాలి' అని ప్రేమగా నన్ను పిలిచినా నీ నోటిలో అమ్మా, ఈనాడు కేవలం ఇన్ని ముడి బియ్యపు గింజలను వేస్తున్నాను.

౨.అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతికాలే కియదవోచ ఉచ్చైహ్!
క్రిష్ణేతి గోవిందేతి హరే ముకుందేతి అహో జనన్యై రచితోయమంజలిహ్!!

'అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!' అంటూ పంటి బిగువున ప్రసవ వేదనను భరించి నాకు జన్మనిచ్చిన తల్లీ! నీకు నమస్కరిస్తున్నాను.

౩.ఆస్తాం తావడియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యధా!
నైరుచ్యం తనుశోషణం మలమపి శయ్యా చ సాంవత్సరీ!
ఏకస్యాపి న్ గర్భభార భరణ క్లేశస్య యస్స్యాక్షమో!
దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః!!

అమ్మా! నన్ను కన్నా సమయంలో నువ్వు ఎంతటి శూల వ్యధను అనుభించావో కదా! కళను కోల్పోయి, శరీరం శుష్కించి, శయ్య మలినమైనా - సం!! కాలం ఆ క్లేశాన్ని ఎలా భరించావో కదా! ఎవరైనా అలాంటి బాధను సహించగలరా? ఎంత ఉన్నతుడైనా కుమారుడు తల్లి రుణాన్ని తీర్చుకోగాలడా? నీకు అంజలి ఘటిస్తున్నాను.

౪.గురు కులముపసృత్య స్వప్న కాలేపి తు దృష్ట్వా!
యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైహ్!
గురుకులముపసృత్య సర్వం ప్రరుదత్తే సమక్షం!
సదపి చరణయోస్తే మాతురస్తు ప్రణామః!!

స్వప్నంలో నన్ను సన్యాసి వేషంలో చూసి, కలతపడి, గురుకులానికి వచ్చి బిగ్గరగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడి వారందరికీ ఖేదం కలిగించింది. అంతటి ప్రేమమయివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నానమ్మా!

౫.న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా!
స్వ గావా నో దత్తా మరనదివసే శ్రాద్ధవిధినా!
న దత్తో మాతస్తే మరణ సమయే తారక మనురకాలే!
సంప్రాప్తే మయి కురు దయం మాతరతులాం!!

అమ్మా! సమయం మించి పోయాక వచ్చినందువల్ల మరణ సమయంలో గుక్కెడు నీళ్ళు కూడా నేను నీ గొంత్లో పోయలేదు. శ్రాద్ధ విధిగా గోదానమైనా చేయలేదు. ప్రాణోత్క్రమణ సమయంలో నీ చెవిలో తారక మంత్రాన్ని ఉచ్ఛరించలేదు. నన్ను క్షమించి, నా యందు తులలేని దయ చూపించు తల్లీ!

ఈ ఐదు స్లోకాశ్రు కణాల్లోనూ 'మాతృదేవో భవ' అనే గంభీర ఉపనిషద్వాణి ప్రతిష్టితమై ఉంది. మహిత వేదాంత ప్రవచానానికే కాదు - మహనీయ మాతృ భక్తి ప్రకటనకు కూడా ఆచార్యకం ఆదిశంకరుల వాణి.
Read more...

నిర్వాణ షట్కం

0 comments
(1 )
మనో బుద్ధ్య హంకార చిత్తాని నాహం న కర్ణం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే
నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు: చిదానంద రూపశ్శివోహం శివోహం

నేను మనసునూ కాను, బుద్దినీ కాను, అహంకారమునూ కాను, చిత్తమునూ కాను, నేను
కర్ణములనూ కాను, నేను జిహ్వ నూ కాను, నేను ఘ్రాణ ఇంద్రియము ఐననాసికనూ కాను,
నేను చక్షురింద్రియము ఐన నేత్రములనూ కాను. నేను ఆకాశమునూ కాను, నేను భూమినీ
కాను నేను తేజస్సునూ కాను, నేను వాయువునూ కాను, చిదానంద రూపుదనైన శివుడనే,
శివుడనే. నేను అంతః కరణ చతుష్టయము ఐన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారములను
కాను. నేను జ్ఞానేద్రియములైన త్వక్, చక్షు, శ్రోత్ర, (జిహ్వ)రసన, ఘ్రాణ ఇంద్రియములు అంటే
చర్మము, కనులు, చెవులు,నాలుక, నాసిక(ముక్కునూ) కాను.అంటే 'నాకోసం' అని ఎవరి కోసం
అయితే చర్మము ద్వారా, కనుల ద్వారా, చెవుల ద్వారా, నాలుక ద్వారా, ముక్కు ద్వారా
ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నానో ఆ అనుభవించేది నేను కాను. ఆ
అనుభవము నాదీ కాదు. అంటే అనుభవించే వాడు వేరే, నేను కాదు. అంటే నాకోసం అని
తుచ్చమైన ఆనందాలకు నేను లోను కానవసరం లేదు, కాకూడదు, అంటే నేనే కాదు ఎవరూ
కూడా లోను కావలసిన అవసరం లేదు. ఎందుకంటే వీటి ద్వారా కలిగే ఆనందాలు క్షణికాలు
కనుక! నేను పంచ మహా భూతములు ఐన పృదివ్యాపస్తేజో వాయురాకాశములను కాను.అంటే
నేను భూమిని కాను, జలమును అంటే నీరునూ కాను, తేజస్సు అంటే అగ్నినీ కాను, నేను
వాయువునూ కాను, ఆకాశమునూ కాను. పంచ భూతాత్మకమైన ఈ శరీరమును నేను కాను.
ఎందుకంటే పంచ భూతాత్మికమైన ఈ శరీరం పంచ భూతములలో కలిసిపోతుంది కనుక. ఇక్కడి
ఇంకొక రహస్యం ఏమిటంటే పంచ తన్మాత్రలైన శబ్ద, రూప, స్పర్శ, రస, గంధములనుండి వరుసగా
పంచ మహా భూతములు ఐన ఆకాశము,అగ్ని,వాయువు, జలము, భూమి ఉద్భవించాయి,
వీనిని గ్రహించడానికి, అనుభవించడానికి వరుసగా పంచ జ్ఞానేంద్రియములు ఐన చెవులు, కనులు, చర్మము, జిహ్వ, నాసిక ఉద్భవించాయి. వీటి ద్వారా ఈ జ్ఞానములు అనుభవం లోకి వస్తాయి
కనుక వీటిని జ్ఞానేంద్రియములు అన్నారు.

2)
నచ ప్రాణ సంజ్ఞో నవై పంచా వాయుర్నవా సప్త ధాతుర్నవా పంచ కోశః
న వాక్ పాణి పాదౌ నచోపస్థ పాయు చిదానంద రూపశ్శివోహం శివోహం

నేను ప్రాణ వాయువులైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయు సంఘమును కాను,
సప్త ధాతువులైన రక్త, మాంస, మేథ, అస్థి, మజ్జ, శుక్ర, రసములను కాను, నేను అన్నమయ,
ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములనే పంచ కోశములను కాను, నేను
పంచ కర్మేంద్రియములైన వాక్కు, చేతులు, పాదములు, కామ ఇచ్చను తీర్చుకునే ఇంద్రియమును
కాను, విసర్జక అవయవ ఇంద్రియమునూ కాను..చిదానంద రూపుదనైన శివుడనే, నేను శివుడనే!

(3)
న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ
న ధర్మో నచార్దో న కామో న మోక్షః చిదానంద రూపశ్శివోహం శివోహం

నాకు ద్వేషము లేదు, రాగము లేదు, నాకు లోభము లేదు,మోహము లేదు, నాకు మదము కానీ, మాత్సర్యము కానీ లేవు, నాకు ధర్మము, అర్ధము, కామము, మోక్షము లేవు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! అనగా నాకు ఏ ద్వంద్వములూ లేవు, నాకు యే
పురుషార్ధములూ లేవు..ఎందుకనగా..నేను భౌతిక శరీరాన్ని కలిగిన మానవుడిని కాను కనుక,
నేను సాక్షాత్తూ శివుడను కనుక, మానవ సహజమైన మంచి చెడులకు అతీతుడను కనుక!

4)
న పుణ్యం న పాపం న సౌఖ్యం న డు:ఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ
అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానంద రూప శ్శివోహం శివోహం

నాకు పుణ్యము లేదు, పాపమూ లేదు, సౌఖ్యము లేదు, దు:ఖము లేదు,మంత్రము, తీర్ధము,
వేదము, యజ్ఞము, ఏవీ లేవు. నేను అనుభవమును కాను, అనుభవించుట యను క్రియనూ
కాను, అనుభవించే వాడినీ కాను, నేను చిదానంద రూపుడనైన శివుడను, నేను శివుడను!

(5)
న మృత్యుర్నశంకా నమే జాతి భేద: పితా నైవ మే నైవ మాతా చ జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపశ్శివోహం శివోహం

నాకు మృత్యువు లేదు, శంకా లేదు, జాతి భేదములు లేవు, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, జన్మ
లేదు, నాకు బంధువులు లేరు, మిత్రులు లేరు, గురువు లేడు, శిష్యులు లేరు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! జనన మరణములు, జాతి భేదములు, తల్లి దండ్రులు,
గురు శిష్యులు..ఏ బంధములు లేవు..ఎందుకనగా..నేను శివుడను కనుక..అన్ని బంధములకు, అనుబంధములకు అతీతుడను కనుక!

6)
అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణామ్
న చా సంగతం నైవ ముక్తిర్నబంధః చిదానంద రూపశ్శివోహం శివోహం

నేను నిర్వికల్పుడను అనగా నాకు వేరే సాటి ఐనది లేదు, నేను నిరాకారుడను, ఎందుకంటే ఈ
ఆకారం శాశ్వతం కాదు కనుక, అన్నింటికీ, అంతటా అన్ని ఇంద్రియములకూనేనే అధిపతిని, నాకు సంబంధించినవి, సంబంధించనివి ఏవీ లేవు, నాకు ముక్తి లేదు, బంధమూ లేదు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! ఇది నిర్వాణ శతకమునకు సాహిత్యానువాదము, కొద్ది వ్యాఖ్యానముతో. ఆది శంకరాచార్యులవారి సాహిత్యం స్తోత్ర భక్తి సాహిత్యము, వైరాగ్య ప్రకరణములు
అని రెండుగా విభజించ వచ్చు క్లుప్తముగా. ఇది వైరాగ్య ప్రకరణముల కోవలోనిది. ఆధునిక పోటీ
పరీక్షలలో జవాబులు తప్పుగా ఇచ్చినప్పుడు, సరిగా జవాబులిచ్చిన కారణంగా వచ్చే 'మార్కుల'
నుండి తప్పుగా ఇచ్చిన వాటికి శిక్షగా మార్కులు తగ్గించే పద్ధతి వుంటుంది కొన్ని పరిక్షలలో.
అందుకని సమాధానం సరిగా తెలియనప్పుడు సరి కాని సమాధానములను వరుసగా ఇది కాదు,
ఇది కాదు అని చివరికి సరి ఐన లేదా సరి ఐనట్లు అనిపించిన సమాధానమును చేరుకొనే పద్ధతి
మొకటి ఉంది. దీనినే తీసివేత పద్ధతి లేదా ఆంగ్లంలో ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు. భగవంతుని రూపమును, తత్త్వమును తెలిసికొనడం, అసాధ్యం కనుక, ఏది భగవంతుడో తెలియనప్పుడు, ఏది
భగవంతుని తత్త్వమో తెలియనప్పుడు ఏది భగవంతుని తత్త్వము కాదో తెలిసికొనడం తేలిక కనుక
'ఇది కాదు' 'ఇది కాదు' అని తీసి వేస్తూ చివరికి మిగిలిన వర్ణనకు, వ్యాఖ్యానమునకూ అందని
తత్త్వమేదో అదే పరమాత్మ తత్త్వము అని తెలిసికొనడాన్ని వేదాంతం 'నేతి'..'నేతి'..అంటే
.'న ఇతి'..'న ఇతి'..అంటే..'ఇది కాదు'..'ఇది కాదు'..అనే 'నేతి' మార్గం అని చెప్పింది! ఈ నిర్వాణ
శతకం లో 'చిదానంద రూపుడైన శివుడు' అనే పరమాత్మ తత్త్వాన్ని అదే మార్గంలో ఆది శంకరుడు
తెలియ జేశారు! నిర్వాణ షట్కం భారతీయ వేదాంత మార్గంలో ఉన్నతమైన రచన. నిజానికి ఎంతో
దీర్ఘమైన వ్యాఖ్యానము, వివరణ అవసరము కాని, ఇక్కడ క్లుప్తముగా మాత్రమే చర్చ ప్రస్తుతానికి!
ఒకరి అభ్యర్ధన మేరకు, వారి సందేహములను ప్రస్తుతానికి తీర్చడానికి నాకున్న కొద్ది పరిధిలో, అల్ప జ్ఞానముతో చేస్తున్న ప్రయత్నము ఇది.

మనో బుద్ధ్యాహంకార చిత్తాని నాహం.. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగు
విధములైన అంతః కరణ ప్రవృత్తులు వున్నాయి.

మనసు అన్నింటికీ అధిపతి. లేని దాన్ని ఉన్నట్లుగా, తనది కాని దాన్ని తనదే అన్నట్లుగా,
క్షణికమైన దానిని శాశ్వతమన్నట్లుగా మరులు గొల్పుతుంది, వుసి గొల్పుతుంది, పురి
కోల్పుతుంది, భ్రమింప జేస్తుంది, మరిపిస్తుంది, మురిపిస్తుంది, ఆకాశానికి ఎత్తేస్తుంది,
అందలాలెక్కిస్తుంది, అధః పాతాళానికి తొక్కేస్తుంది. కనుకనే మనసే అన్నింటికీ కారణం, ప్రేరణం,
ఉత్ప్రేరకం, వినాశకరం. అందుకే ' మన ఏవ మనుష్యాణామ్ కారణం బంధ మోక్షయో:
' మనుషుల బంధాలకు, మోక్షానికి కారణం మనసే అన్నది ఒక ఉపనిషత్తు! 'ద్వే శబ్దే బంధ
మోక్షాయ మమేతి న మమేతిచ, మమేతి బధ్యతే జంతు: న మమేతి విముచ్యతే.. 'నాది',
'నాది కాదు' అనే రెండు శబ్దాలే బంధానికీ, మోక్షానికీ కారణాలు, నాది అనుకుంటే బంధం,
ఎందుకంటే నాది అనే దానితో మొదలై, నాది మాత్రమే, నాకు మాత్రమే, నాకు కాకున్నా పరవా
లేదు ఎవరికీ కాకూడదు..నాది కాకున్నా పరవా లేదు, ఎవరిదీ కాకూడదు, ఎవరికీ చెందకూడదు..
అనే దాకా దారి తీస్తుంది. ఆది వినాశనానికి దారి తీస్తుంది. ఈ నాడు సమాజంలో జరుగుతున్న
హింసకు, దౌర్జన్యానికీ అదే కారణం!

బుద్ధి విచక్షణను కలిగిస్తుంది. మంచి, చెడులను గ్రహింప గలుగుతుంది. చిత్తము తన ఇష్టం
వచ్చినట్లుగా ప్రవర్తించేలా చేస్తుంది. అహంకారం మహదహంకారం(గొప్ప అంధకారం)
మిధ్యాహంకారం (మిధ్యాన్ధకారం) అని రెండు రకాలుగా ఉన్నది. అహంకారం అంటేనే అంధ కారం.
సృష్టికి మొదలు మహా అంధకారం వ్యాపించి వున్నది..ఏదీ తెలియని బ్రహ్మ దేవుడు తనకన్నా పరమాత్ముడు ఐన వాడిని ప్రార్ధిస్తే ఆ శ్రీ మహా విష్ణువు తన తేజః పుంజములతో దానిని తొలగించి కరుణిస్తే, అప్పుడు బ్రహ్మ తన సృష్టిని కొనసాగించాడు అని పురాణ గాధ.

నేను అనేది సాత్త్వికాహంకారం, నేను కూడా అనేది రాజసిక అహంకారం, నేను మాత్రమే అనేది
తామసిక అహంకారం! నేను ఏమిటి, ఎవరు, ఎందుకు, ఎక్కడి నుండి, ఎక్కడికి అనే అన్వేషణ
సాత్త్వికమైనది, మనిషిని వున్నతుడిని చేస్తుంది. నేను కూడా అనేది రాజసికమైనది, నాకూ ఒక
ఉనికి, ఒక సత్తా ఉంది అనే సాధనకు ఉపకరిస్తుంది..ఈ రెండూ మంచివే..అవసరమైనవే. నేను
మాత్రమే, నాకు మాత్రమే, నాది మాత్రమే అనేది తమసికమైనది, ఆది కలిగివున్నవాడిని, వాడి
ద్వారా సర్వాన్నీ నాశనం చేస్తుంది. ఈ నాశనానికి చిత్తం బాటు వేస్తుంది, చిత్తం వచ్చినట్లు
ప్రవర్తించడం ద్వారా, దానికి మనసు కారణమౌతుంది సరిగా వుపయోగించకుంటే, మనసే
అన్నింటికీ కారణం కనుక దానిని బుద్ధికి స్వాధీనం చేసి, అప్పుడు బుద్ధి ద్వారా కలిగిన విచక్షణతో
మంచి చెడులను తెలిసికొని, మంచిని గ్రహించి, చెడును విసర్జించాలి కనుక బుద్ధి పరమాత్మ తత్త్వం. ఉపనిషత్తులు అన్నీ ఇదే చెప్పాయి.

ఆత్మానగుం రధినం విద్ధి శరీరం రధమేవతు బుద్ధించ సారధిం విద్ధి, మనః ప్రగ్రహమేవచ,
ఇన్ద్రియాణి హయాన్యాహు: తేషాం విషయ గోచరాన్, అత్మెంద్రియ మనో యుక్తం
భోక్తేత్యాహుర్మనీషిణః .. అన్నది ఒక ఉపనిషత్తు. అంటే శరీరమే రధము. ఆత్మ అంటే పరమాత్మ
స్వరూపి ఐన జీవాత్మ రధికుడు. అంటే రధాన్ని ఎక్కే వాడు. బుద్ధి సారధి. అంటే పరమాత్మ
రూపకమైన బుద్ధి ఈ రధాన్ని నడిపితే, గుర్రములవంటి ఇంద్రియములను మనసు అనే కళ్ళెం తో
అదుపు చేస్తూ, పరమాత్ముడి సారధ్యంలో, సర్వం ఆయనకే అప్పగించి, నమ్మి,కూర్చుంటే రధాన్ని క్షేమంగా గమ్యానికి నడుపుతాడు, కనుక మనసు అనే కళ్ళెమును కూడా సారధి ఐన
పరమాత్ముడికి అప్పగించాలి అంటే మనసును పరమాత్ముని యందు లగ్నం చేయాలి. ఆత్మ, ఇంద్రియాలు, మనసు కలిగిన వాడిని భోక్త అంటారు, డానికి బుద్ధిని కూడా జోడిస్తే ఆ భోక్తృత్వ
భావన నశిస్తుంది. అప్పుడు నేను చేస్తున్నాను, చూస్తున్నాను, అనుభవిస్తున్నాను అనే భావన
నశిస్తుంది. అప్పుడు సుఖ దు:ఖాలూ, రాగ ద్వేషాలు, బంధ మోక్షాలూ, మంచీ చెడూ, ఇలాంటి ద్వంద్వాలు నశిస్తాయి. శివమే అంటే శాంతమే, సౌఖ్యమే, ఆనందమే మిగులుతుంది..కనుక శివోహం..శివోహం!

బుద్ధికి అప్పజెప్పి ప్రయాణం చేస్తే కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రి యాలూ దారి తప్పవు, మంచి కర్మలే మిగులుతాయి, మంచి జ్ఞానమే మిగులుతుంది అప్పుడు శివుడౌ తాడు మానవుడు, కనుక ఇంతా
కలిగిన శివుడనే నేను!

సప్త ధాతువులు, పంచ ప్రాణాలు, పంచ కోశాలు, బంధాలు, భవ బంధాలు, అనుబంధాలు,
సంబంధాలు అన్నీ నేను దేహం అనుకుంటే అవి గెలుస్తాయి, నేను దేహమును కాను, ఎందుకంటే
దేహం శాశ్వతం కాదు కనుక, అని తెలిసికొంటే దేహం నశిస్తుంది, ఆత్మ రహిస్తుంది, ఆత్మ
మిగులుతుంది, ఆ ఆత్మ పరమాత్మ తత్త్వం కనుక, జీవం ఉన్నంత కాలం జివునితో ఉంది
తరువాత దేవునితో కలిసిపోతుంది కనుక, డానికి మరణం లేదు, కనుక ఆది శాశ్వతం.
ఈ జ్ఞానం కలిగితే దేహం ద్వారా వచ్చే ఏ మంచి చెడు..సుఖ దు;ఖాలు..మొదలైన ద్వంద్వాలున్డవు
కనుక అప్పుడు మిగిలేది పరమానందమే కనుక నేను శివుడను, నేను శివుడనే!

మనసును బుద్ధి ద్వారా నియమించుకుని కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను
జయించి, కర్మేన్ద్రియములను, జ్ఞానేన్ద్రియములను, ప్రాణ వాయువులను, సప్త ధాతువులను,
పంచ మహా భూతాలను, పంచ కోశాలను జయించి అంటే ఇవన్నీ జయించడం ద్వారా మిగిలిన పరమానందమును అనుభవించడం ద్వారా చిదానంద రూపుడైన శివుడను నేను, శివుడనే నేను!

యద్వాచా నాభ్యు దితం యేన వాగాభ్యుధ్యతే ....
యన్మనసా న మనుతే ఏనాహుర్మనోమతం ....
యత్ చక్షుసా న పశ్యతి యేన చక్శూగుమ్సి పశ్యతి....
యత్ శ్రోత్రే ణ న శ్రుణోతి యేన శ్రోత్రమిదం శ్రుతం...
యత్ ప్రాణేన న ప్రాణితి యేన ప్రాణాః ప్రణీయతే...
తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిద ముపాసతే ....

ఏది వాక్కుల ద్వారా తెలిసికొన బడ జాలదో, దేని ద్వారా వాక్కు పలుకడం జరుగుతుందో, ఏది
మనసు ద్వారా తెలిసికొన బడ జాలదో, దేని ద్వారా మనసు దేనినైనా తెలిసికొన గలుగుతుందో,
ఏది కనుల ద్వారా చూడ బడ జాలదో, దేని ద్వారా కనులు చూడ గలుగుతాయో, ఏది చెవుల
ద్వారా వినబడ జాలదో దేని ద్వారా చెవులు విన గలుగుతాయో, ఏది ప్రాణములచేత జీవింపదో,
దేని ద్వారా ప్రాణములు జీవింప గలుగుతాయో అదియే బ్రహ్మము..వేరేది ఏదీ కాదు..అని
చెప్పింది ఉపనిషత్తు. రెండు పెదవులు, ముప్పై రెండు పళ్ళూ, నాలుక, కొండ నాలుక వున్నవాళ్ళు
కూడా పలుక లేని వారు వున్నారు, మూగ వాళ్ళు, అంటే వీటన్నింటికీ పలుకును ఇచ్చే శక్తి ఒకటి వున్నది కదా, ఆది లేక పోతే ఇవన్నీ వున్న వాళ్ళు కూడా పలుకలేరు కదా, కళ్ళు, కను బొమలు,
కను గుడ్లు అన్నీ సరిగా వున్నా చూపు లేని వాళ్ళు గుడ్డి వాళ్ళు వున్నారు, అంటే వీటన్నింటికీ
చూపును ఇచ్చే శక్తి ఒకటి వేరేది వున్నది, అలాగే చెవులున్నా, కర్ణభేరి వున్నా మిగిలినవి అన్నీ
సరిగా వున్నా వినలేని చెవిటి వాళ్ళు వున్నారు, అంటే వీటన్నిటికీ విన గలిగిన శక్తిని ఇచ్చే శక్తి
ఒకటి వున్నది కదా, ప్రాణములు వున్నప్పుడూ తెలియబదనిది, అదేదో తెలియనిది లేకుంటే
ప్రాణములు లేకుండా పోతాయో దాని వల్లనే ప్రాణములున్నట్లు, జీవం వున్నట్లు కనిపిస్తుందో...
అదియే బ్రహ్మము..అంటే కేవలమ్మ్పైకి కనిపించే నోరు, కళ్ళు, చెవులు,ఇవన్నీ సరిగా వున్న
అవి పని చేయకుండ పోతాయి, అంటే వీటికి శక్తినిచ్చే శక్తి ఒకటి ఉంది కదా..అదే బ్రహ్మం.
పంచకర్మెంద్రియలూ. పంచా జ్ఞానేంద్రియాలు అలాగే వున్నా ప్రాణం లేని శరీరం ఎందుకూ పనికి
రాదు, ఏదీ చేయ లేదు. నోరున్నా పలుక లేదు,చేతులున్నా పను చేయ లేవు, కాళ్ళు వున్నా
నడువ లేవు, కామేంద్రియం వున్నా పని చేయదు, కామం వుండదు, విసర్జక అవయవం వున్నా
విసర్జించే శక్తి వుండదు , చర్మం వున్నా స్పర్శను గ్రహింప లేదు, కనులు వున్నా చూడలేవు,
చెవులు వున్నా వినలేవు, నాలుక వున్నా రుచి చూడ లేదు, ముక్కు వున్నా వాసన చూడలేదు,
సప్త ధాతువులూ వున్నా వాటి పని అవి చేయ లేవు, పంచా కోశాలు వున్నా పనికి రావు..ఇవన్నీ
వున్నా ఏది లేకుంటే ఇవన్నీ లేనట్లే లెక్కనో అదే ప్రాణ శక్తి, అదే బ్రహ్మం, అదే జీవం, అదే నాదం,
అదే వేదం! కనుక ఆ శక్తిని మాత్రమే శాశ్వతము ఐన శక్తిగా తెలిసికొంటే మిగిలినవన్నీ అశాశ్వతాలు
అని తెలిసికొనడం జరుగుతుంది. అప్పుడు మిగిలిన వాటి ద్వారా వచ్చే సుఖ దు:ఖాలు, జయాపజయాలు, క్షణికమైనవి అని తెలుస్తుంది, ఆనందమే మిగులుతుంది, కనుక శివుడని
పోతాను కనుక నేను శివుడను, నేను శివుడనే!

అశబ్ద మస్పర్శ మరూప మవ్యయం
తథా అరసం నిత్య మగంధ వచ్చయత్
అనాద్యనంతం మహతః పరం ధృవం
నిచాయ్య తన్మ్రుత్యు ముఖాత్ప్ర ముచ్యతే..అన్నది ఉపనిషత్తు ఇదే భావాన్ని తెలియ జేస్తూ..ఈ
జ్ఞానం కలిగినప్పుడు మృత్యువు లేకుండా పోతుంది, పుట్టుకే శాశ్వతం కాదు అని తెలిస్తే
మృత్యువూ శాశ్వతం కాదు అని తెలుస్తుంది కనుక మృత్యువు వుండదు, ఇదంతా అశాశ్వతం
అని తెలుస్తుంది కనుక ఇవన్నీ పోయేవే అని తెలుస్తుంది కనుక భయం వుండదు, ఆ భయమే మృత్యువు, ఆ బలహీనతే మృత్యువు, తెలిసికొన్న ఆ శాశ్వత సత్యం, ఆ శక్తి అదే జీవం, ఎందుకంటే
డానికి చావు అంతం అనేది లేదు కనుక, ఇదే భావాన్ని స్వామి వివేకానంద చెప్పింది! ఇక్కడ చావు వుండదు అంటే పుట్టుకా శాశ్వతం కాదు, చావూ శాశ్వతం కాదు, అవి సహజ ధర్మాలు,అనివార్యాలు
అని తెలియడం వలన కలిగే జ్ఞానం వలన కలిగే ఆనందం వలన మృత్యు భీతి వుండదు కనుక
మృత్యు భావం వుండదు కనుక మృత్యువు వుండదు అని అర్థం, అంతే కానీ ఈ జ్ఞానం కలిగిన
వాడు శారీరకంగా చిరంజీవి అని కాదు, శరీరానికే మృత్యువు, ఆత్మకు కాదు అని తెలిసికొనడం
వలన కలిగే చావు లేని ఆత్మ జ్ఞానం అని అర్థం!..ఎందుకంటే ఆ ఆత్మకు చావు లేదు కనుక..
ఇదే శ్రీ కృష్ణుడు అర్జునునితో చెప్పింది!

నిర్వాణ షట్కానికి ఇంకా పంచ కోశ వివరణ మాత్రమే వున్నది..ఇక్కడ మిగిలిపోయింది..అది ఇంకా
మరీ లోతైనది, ఇక్కడ అంత అవసరం ఈ సాహిత్యాన్ని అర్థం చేసికొనడం కోసం లేదని ప్రస్తుతానికి
ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను. నా అల్ప బుద్ధికి అందిన విషయాన్ని ఇక్కడ ఇవ్వడానికి ఆ జగద్గురువుల ప్రేరణకు ఆయన పాద పద్మములకు వినయంగా అంజలిస్తూ...స్వస్తి!(1 )

ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను. నా అల్ప బుద్ధికి అందిన విషయాన్ని ఇక్కడ ఇవ్వడానికి ఆ జగద్గురువుల ప్రేరణకు ఆయన పాద పద్మములకు వినయంగా అంజలిస్తూ...స్వస్తి!

Read more...

శ్రీమచ్చంకారాచార్య కృత సువర్ణమాలా స్తుతి:

0 comments
అథకథమపిమద్రసనాంత్వద్గుణలేశైర్విశోధయామి విభో !
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణ యుగం ||
ఆఖండల మదఖండన పండిత తండుప్రియ చండీశ విభో ! 
సాంబసదాశివ శంభో శంకర శరణం మే తవ చరణ యుగం ||

ఇభచర్మాంబర! శంబర రిపు వపురపహరణోజ్వల నయన విభో !
సాంబ |ఈశ! గిరీశ! నరేశ! పరేశ! మహేశ! బిలేశయ భూషణ! భో! సాంబ ||
 
ఉమయా దివ్యసుమఞ్గళ విగ్రహయాలిఞ్గిత వామాఞ్గ విభో! || సాంబ ||
ఊరీకురుమా మఙ్ఞమనాథం దూరీకురు మే దురితం భో! || సాంబ ||
ఋషివరమానస హంస చరాచర జనన స్థితి లయ కారణ భో! || సాంబ ||
ౠక్షాధీశ! కిరీటి! మహోక్షారూఢ! విధృత రుద్రాక్ష విభో! || సాంబ ||
లు్‌వర్ణద్వంద్వ మవృంత కుసుమమివాంఘ్రౌ తవార్పయామి విభో! || సాంబ ||
ఏకం సదితి శృత్యాత్వమేవ సదసీ త్యుపాస్మహే మృడ భో! || సాంబ ||

ఐక్యం నిజ భక్తేభ్యో వితరసి విశ్వంభరోత్ర సాక్షీ భో! || సాంబ ||
ఓమితి తవ నిర్దేష్ట్రీ మాయా~స్మాకం మృదోపకర్త్రీ భో! || సాంబ ||
ఔదాస్యం స్ఫుటయతి విషయేషు దిగంబరతా చ తవైవ విభో! || సాంబ ||
అంతఃకరణ విశుధ్ధిం భక్తిం చ త్వయి సతీం ప్రదేహి విభో! || సాంబ ||
అస్తోపాధి సమస్త వ్యస్తై రూపైర్జగన్మయోసి విభో! || సాంబ ||

కరుణా వరుణాలయ మయి దాస ఉదాసస్తవోచితో నహి భో! || సాంబ ||
ఖలసహవాసం విఘటయ ఘటయ సతామేవ సంగమనిశం భో! || సాంబ ||
గరళం జగదుపకృతయే గిలితం భవతాసమోస్తి కోత్ర విభో! || సాంబ ||
ఘనసార గౌరగాత్ర! ప్రచుర జటాజూట భధ్ధ గంగ విభో! || సాంబ ||
ఙ్ఞప్తిస్సర్వ శరీరేష్వఖండితా యా విభాతి సాత్వం భో! || సాంబ ||

చపలం మమ హృదయ కపిం విషయేద్రుచరం దృఢం బధాన విభో! || సాంబ ||
ఛాయాస్థాణోరపి తవ తాపం నమతాం హరత్యహో శివభో! || సాంబ ||
జయ! కైలాస నివాస! ప్రమథగణాధీశ! భూసురార్చిత! భో! || సాంబ ||
ఝణుతక ఝంతరి ఝణుతక్కిట తక శబ్దైర్నటసి మహానట భో! || సాంబ ||
ఙ్ఞానం విక్షేపావృతి రహితం కురు మే గురుస్త్వమేవ విభో! || సాంబ ||

టంకార స్తవధనుషో దలయతి హృదయం ద్విషామశనిరివ భో! || సాంబ ||
ఠాకృతిరివ తవ మాయా బహిరంతశ్శూన్యరూపిణీ ఖలు భో! || సాంబ ||
డంబరమంబురుహామపి దలయత్యనఘం త్వదంఘ్రి యుగళం భో! || సాంబ ||
ఢక్కా~క్షసూత్ర శూల ద్రుహిణ కరోటీ సముల్లసత్కర భో! || సాంబ ||
ణాకార గర్భిణీ చేఛ్ఛుభదా తే శరగతిర్నృణామిహ భో! || సాంబ ||

తవమన్వతి సంజపతస్సద్యస్తరతి నరో హి భవాబ్ధిం భో! || సాంబ ||
థూత్కారస్తస్య ముఖే భూయాత్తే నామ నాస్తి యస్య విభో! || సాంబ ||
దయనీయశ్చ దయాళుః కోస్తి మదన్యస్త్వదన్య ఇహ వద భో! || సాంబ ||
ధర్మస్థాపన దక్ష త్ర్యక్ష గురో దక్ష యఙ్ఞ శిక్షక భో! || సాంబ ||
నను తాడితోసి ధనుషా లుబ్ధధియా త్వం పురా నరేణ విభో! || సాంబ ||

పరిమాతుం తవ మూర్తిం నాలమజస్తత్పరాత్పరోసి విభో! || సాంబ ||
ఫలమిహ నృతయా జనుషస్త్వత్పదసేవా సనాతనోసి విభో! || సాంబ ||
బలమారోగ్యంచాయుస్త్వద్గుణ రుచితాం చిరం ప్రదేహి విభో! || సాంబ ||
భగవాన్ భర్గ భయాపహ భూతపతే భూతి భూషితాంగ విభో! || సాంబ ||
మహిమా తవ న హి మాతి శృతిషు హిమానీ ధరాత్మజాధవ భో! || సాంబ ||

యమనియమాదిభిరంగైర్యమినో హృదయే భజంతి స త్వం భో! || సాంబ ||
రజ్జావహిరివ శృక్త్తౌ రజతమివ త్వయి జగంతి భాంతి విభో! || సాంబ ||
లబ్ధ్వా భవత్ప్రసాదాచ్చక్రం విధురవతి లోకమఖిలం భో! || సాంబ ||
వసుధా తధ్ధర తచ్ఛయరథ మౌర్వీశర పరాకృతాసుర భో! || సాంబ ||

శర్వదేవ సర్వోత్తమ సర్వద దుర్వృత్త గర్వ హరణ విభో! || సాంబ ||
షడ్రిపు షడూర్మి షడ్వికారహర సన్ముఖ షన్ముఖ జనక విభో! || సాంబ ||
సత్యం ఙ్ఞానమనంతం బ్రహ్మేత్యేతల్లక్షణ లక్షిత భో! || సాంబ ||

హాహాహూహూ ముఖ సుర గాయక గీతాపదానపద్య విభో! || సాంబ ||
ళాదిర్నహి ప్రయోగస్తదంతమిహ మఞ్గళం సదాస్తు విభో! || సాంబ ||
క్షణమివ దివసాన్నేష్యతి త్వత్పద సేవాక్షణోత్సుకశ్శివ భో! || సాంబ ||

|| ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్యస్య శ్రీ గోవింద భగవత్పూజ్యపాద శిష్యస్య శ్రీమఛ్ఛంకరభగవతః కృతౌ సువర్ణమాలాస్తుతిః సంపూర్ణా

Read more...

శ్రీ మచ్చంకరాచార్య కృత త్రిపురసుందర్యష్టకమ్

0 comments

కదమ్బవనచారిణీం మునికదమ్బకాదమ్బినీం
నితమ్బజితభూధరాం సురనితమ్బినీసేవితామ్|

నవామ్బురుహలొచనామభినవామ్బుద
శ్యామలాం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||౧||

కదంబవృక్షములు (కడిమి చేట్లు) వనమందు నివసించునదీ,మునిసముదాయమను కదంబవృక్షములను వికసింపచేయు (ఆనందింప చేయు) మేఘమాలయైనదీ, పర్వతముల కంటే ఏత్తైన నితంబము కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ,తొలకరిమబ్బు వలే నల్లనైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసుందరిని ఆశ్రయించుచున్నాను.

కదమ్బవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్|
దయావిభవకారిణీం విశదరొచనాచారిణీం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||౨||

కదంబవనమందు నివసించునదీ, బంగారు వీణను ధరించినదీ, అమూల్యమైన మణిహారముల నలంకరించుకున్నదీ, ముఖము నందు వారుణీ (ఉత్తమమైన మద్యము) పరిమళము కలదీ,అత్యధికమైన దయను కురిపించునదీ, గొరొచనము పూసుకున్నదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సున్దరిని ఆశ్రయించుచున్నాను.

కదమ్బవనశాలయా కుచభరొల్లసన్మాలయా
కుచొపమితశైలయా గురుకృపాలసద్వేలయా|
మదారుణకపొలయా మధురగీతవాచాలయా
కయాపి ఘనలీలయా కవచితా వయం లేఏలయా||౩||

కదంబవనములొనున్న ఇంటిలొ నివసించునదీ, వక్షొజములపై పుష్పమాలనలంకరించుకున్నదీ, పర్వతములవలే ఏత్తైన స్తనములు కలదీ, అధికమైన కృపాసముద్రమునకు తీరము వంటిదీ, మద్యముచే ఏర్రనైన చేంపలు కలదీ, మధుర సంగీతమును గానము చేయు చున్నదీ, వర్ణించనలవి కానిదీ, మేఘము వలే నల్లనైనదీ అగు ఒక లీలచే మనము రక్షించబడుచున్నాము.

కదమ్బవనమధ్యగాం కనకమణ్డలొపస్థితాం
షడమ్బురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్|
విడమ్బితజపారుచిం వికచచన్ద్రచూడామణిం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||౪||

కదంబవన మధ్యమునందున్నదీ, బంగారు మండపము నందు కొలువు తీర్చునదీ మూలాధారము-స్వాదిష్ఠానము-మణిపూరము-అనాహతము-విశుద్దము-ఆజ్ఞ అనే ఆరుచక్రములందు నివసించు నదీ, ఏల్లప్పుడు యొగసిద్దులకు మేరుపు తీగవలే దర్శనమిచ్చునదీ, జపాపుష్పము (మంకేన పువ్వు) వంటి శరీర కాంతి కలదీ, శిరస్సుపై చంద్రుని ఆభరణముగా ధరించునదీ, మూడు కన్నులు గల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసున్దరిని ఆశ్రయించుచున్నాను.

కుచాఞ్చితవిపఞ్చికాం కుటిలకున్తలాలఙ్కృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్|
మదారుణవిలొచనాం మనసిజారిసమ్మొహినీం
మతఙ్గమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే||౫||

వక్షస్థలము నందు వీణ కలదీ, వంకరయైన కేశములతొ అలంకరింపబడినదీ, సహస్రార పద్మము నందు నివసించునదీ, దుష్టులను ద్వేషించునదీ, మద్యపానముచే ఏర్రనైనకన్నులు కలదీ, మన్మథుని జయించిన శివుని కూడ మొహింపచేయునదీ, మతంగమహర్షికి కుమార్తేగా అవతరించినదీ, మధురముగా మాట్లాడునదీ అగు త్రిపురసున్దరిని ఆశ్రయించుచున్నాను.

స్మరేత్ప్రథమపుష్పిణీం రుధిరమిన్దునీలామ్బరాం
గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాఞ్చలామ్|ఘనసతనభరొన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||౬||

ప్రథమరజస్వలయై ఆరక్తబిందువు లంటియున్న నల్లని వస్త్రమును ధరించినదీ, మద్యపాత్రను పట్టుకున్నదీ, మద్యపానముచే ఏర్రనై కదలుచున్న కన్నులు కలదీ, ఉన్నతమైన స్తనములు కలదీ, జారుచున్న జడముడి కలదీ, శ్యామల (నల్లనిది) యైనదీ, మూడు కన్నులు గల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపురసున్దరిని ఆశ్రయించుచున్నాను.

సకుఙ్కుమవిలేపనామలికచుమ్బికస్తూరికాం
సమన్దహసితేక్షణాం సశరచాపపాశాఙ్కుశామ్|
అశేషజనమొహినీమరుణమాల్యభూషామ్బరా
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యమ్బికామ్||౭||

కుంకుమతొ కలిసిన విలేపమును పూసుకున్నదీ, ముంగురులను తాకుచున్న కస్తూరీ తిలకమును ధరించినదీ,చిరునవ్వుతొ కలిసిన కన్నులు కలదీ, పుష్పభాణమును-చేరకువింటినీ-పాశాంకుశములను ధరించినదీ, అశేష జనులను మొహింపచేయునదీ, ఏర్రని పూలదండలను-ఆభరణములను-వస్త్రములను ధరించినదీ, జపాపుష్పము వలేప్రకాశించుచున్నదీ అగు జగదంబను జపము చేయునపుడు స్మరించేదను.

పురందరపురంధ్రికాచికురబన్ధసైరంధ్రికాం
పితామహపతివ్రతాపటుపటీరచర్చారతామ్|
ముకున్దరమణీమణీలసదలఙ్క్రియాకారిణీం
భజామి భువనామ్బికాం సురవధూటికాచేటికామ్||౮||

ఇంద్రుని భార్యయగు శచీ దేవిచే కేశాలంకరణ చేయబడినదీ, బ్రహ్మదేవుని భార్యయగు సరస్వతిచే మంచి గంధము పూయబడినదీ, విష్ణుపత్నియగు లక్ష్మీచే అలంకరింపబడినదీ, దేవతాస్త్రీలు చేలికత్తేలుగా కలదీ యగు జగన్మాతను సేవించుచున్నాను

జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర
Read more...

శ్రీ మచ్చంకరాచార్య కృత గౌరీ దశకము

0 comments

లీలారబ్ధస్థాపితలుప్తాఖిలలొకాం
లొకాతీతైర్యోగిభిరన్తశ్చిరమ
ృగ్యామ్|
బాలాదిత్యశ్రెణిసమానద్యుతిప
ుంజా
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీ
డె||౧||
 
తన లీలచే సమస్తలోకములను సృష్టించి కాపాడి నశింపచేయునదీ, లోకాతీతులైన యోగులచే చిరకాలముగా వెతకబడుచున్నదీ, బాలసూర్యసమూహము వంటి కాంతి మండలము కలదీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

ప్రత్యాహారధ్యానసమాధిస్థితిభాజా
నిత్యం చిత్తే నిర్వృతికాష్టాం కలయంతీమ్|
సత్యజ్ఞానానన్దమయీం తాం తనురూపాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడె||౨||ప్రత్యాహారము-ధ్యానము-సమాధి అనుయోగముల నాచరించు యోగుల మనస్సునందు ఎల్లప్పుడు సంతోషమును కలిగించునదీ, సత్యము- జ్ఞానము- ఆనందములు స్వరూపముగా కలదీ, సూక్ష్మరూపమున్నదీ, పద్మములవంటి కన్నులు కలదీ,అగు జగదంబయైన గౌరీదేవిని నేనుస్తుతించుచున్నాను.

చన్ద్రాపీడానన్దితమన్దస్మితవక్త్రాం
చన్ద్రాపీడాలంకృతనీలాలకశొభామ్|
ఇంద్రొపెంద్రాద్యర్చితపాదామ్బుజయుగ్మాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడె||౩||

చంద్రచూడుడగు శివునిచే ఆనందింపచేయబడిన చిరునవ్వు ముఖము కలదీ, తన నల్లని కురులలో చంద్రుని అలంకరించుకున్నదీ, ఇంద్రుడు- విష్ణువు మొదలగు దేవతలచే పూజింపబడు పాదపద్మములు కలదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

ఆదిక్షాన్తామక్షరమూర్త్యా విలసన్తీం
భూతె భూతె భూతకదంబప్రసవిత్రీమ్|
శబ్దబ్రహ్మానందమయీం తాం తటిదాభాం
గౌరీమంబామంబురుహాక్షీమహమీడే||౪||

’అ’ కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరములు తన స్వరూపముగా విలసిల్లుచున్నదీ, పంచమహాభూతములలో (భూమి- నీరు- గాలి- అగ్ని- ఆకాశము) ప్రతి దానియందు అనేక ప్రాణులను సృష్టించునదీ, శబ్దబ్రహ్మస్వరూపిణియైనదీ, ఆనందముతో నండినదీ మెరుపువలే ప్రకాశించునదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీ దేవిని నేను స్తుతించుచున్నాను.

మూలాధారాదుత్థితవీథ్యా విధిరన్ధ్రం
సౌరం చాన్ద్రం వ్యాప్య విహారజ్వలితాఙ్గీమ్|
యేయం సూక్ష్మాత్సూక్ష్మతనుస్తాం సుఖరూపాం
గౌరీమంబామమ్బురుహాక్షీమహమీడే||౫||

సుషుమ్నానాడీ మార్గము ద్వారా మూలాదారచక్రము నుండి బ్రహ్మరంధ్రము వరకు సూర్య చంద్రస్థానములైన ’ఇడా’ ’పీంగళా’ నాడుల యందు విహారించు తేజోమూర్తియైనదీ, సూక్ష్మమైన పధార్థము కంటే సూక్ష్మమైనదీ, సుఖస్వరూపిణియైనదీ, పద్మముల వంటి కన్నుల కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని స్తుతించుచున్నాను.

నిత్యః శుద్ధో నిష్కల ఎకో జగదీశః
సాక్షీ యస్యాః సర్గవిధౌ సంహరణే చ|
విశ్వత్రాణక్రీడనలోలాం శివపత్నీం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||౬||

నిత్యుడు- శుద్దుడు- పరిపూర్ణుడు- ఒక్కడు- జగదీశుడు అగు పరమేశ్వరుడు గౌరీదేవిని చేయు సృష్టి స్థితిలయలకు సాక్షి, ప్రపంచరక్షణము అను క్రీడయందు ఇష్టము కలదీ, శివుని భార్య యైనదీ, పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

యస్యాః కుక్షౌ లీనమఖణ్డం జగదణ్డం
భూయోభూయః ప్రాదురభూదుత్థితమేవ|
పత్యా సార్ధం తాం రజతాద్రౌ విహరన్తీం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||౭||

గౌరీదేవి గర్భమునందున్న సమస్తలోకములు మరల మరల పుట్టుచుండును. లీనమగుచుండును. భర్తతో కలిసి వెండికొండపై విహరించునదీ,పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

యస్యామోతం ప్రోతమశేషం మణిమాలా
సూత్రే యద్వత్ క్వాపి చరం చాప్యచరం చ|
తామధ్యాత్మజ్ఞానపదవ్యా గమనీయాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||౮||

చరాచరరూపమైన ఈ ప్రపంచమంతయు, దారము నందు మణులవలే గౌరీ దేవియందు అల్లుకుని ఉన్నది. అద్యాత్మజ్ఞానమార్గముచే తెలుసుకొనదగినదీ, పద్మములవంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

నానాకారైః శక్తికదమ్బైర్భువనాని
వాప్య స్వైరం క్రీడతి యేయం స్వయమేకా|
కల్యాణీం తాం కల్పలతామానతిభాజాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||౯||

గౌరీదేవి తాను ఒక్కతేగానే ఉండి శక్తివంతములైన నానారూపములతో లోకములనన్నిటినీ వ్యాపించి స్వేచ్చగా క్రీడించిచున్నది. కళ్యాణస్వరూపిణి, భక్తుల పాలిట కల్పలత, పద్మములవంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

ఆశాపాశక్లేశవినాశం విదధానాం
పాదామ్భోజధ్యానపరాణాం పురుషాణామ్|
ఈశామీశార్ధాఙ్గహరాం తామభిరామాం
గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||౧౦||

తన పద్మములను ధ్యానించు మనుషులకు ఆశాపాశములవలన కలుగు బాధలను నశింపచేయునదీ, పరమశివుని అర్ధాంగి, పరమేశ్వరీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

ప్రాతఃకాలే భావవిశుద్ధః ప్రణిధానా-
ద్భక్త్యా నిత్యం జల్పతి గౌరీదశకం యః|
వాచాం సిద్ధిం సంపదమగ్ర్యాం శివభక్తిం
తశ్యావశ్యం పర్వతపుత్రీ విదధాతి||౧౧||

ఎవడైతే శుద్ధమైన హృదయమును కలవాడై భక్తితో ప్రాతఃకాలమునందు ఈ గౌరీ దశకమను స్తోత్రమును పఠించునో అతనికి వాక్సిద్దినీ, ఉన్నతమైన సంపదను, శివభక్తినీ గౌరీదేవి తప్పక ప్రసాదించును.

జయ జయ శఙ్కర హర హర శఙ్కర
Read more...

శ్రీ మచ్చంకరాచార్య కృత భ్రమరాంబాష్టకము

0 commentsచాఞ్చల్యారుణలోచనాఞ్చితకృపాం చన్ద్రార్ధచూడామణిం
చారుస్మేరముఖాం చరాచరజగత్సంరక్షిణీం తత్పదామ్|
చఞ్చచ్చమ్పకనాసికాగ్రవిలసన్ముక్తామణీరంజితాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే||౧||

చంచలములు- ఎర్రనివి- దయతోనిండినవి అగు కన్నులు కలది, అర్థచంద్రుని చూడామణిగాధరించినదీ, చిరునవ్వుతో అందమైన ముఖము కలది, చరాచర ప్రపంచము నంతటినీ సంరంక్షించునది, ’తత్’ అను పదమునకు అర్థమైనది, సంపెంగ పువ్వు వంటి ముక్కు చివరన ముత్యము నలంకరించునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

కస్తూరీతిలకాఞ్చితేందువిలసత్ప్రోద్బాసిఫాలస్థలీం
కర్పూరద్రవమిశ్రచూర్ణఖదిరామోదోల్లసద్వీటికామ్|
లోలాపాఙ్గతరంగితైరతికృపాసారైర్నతానన్దినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే||౨||

కస్తూరి తిలకము శోభిల్లుచున్న నొసటి ప్రదేశము కలది, కర్పూరము- సున్నము- వక్కలతో సుగంధభరితమైన తాంబూలమును సేవించుచున్నది, చంచలమైన కటాక్షముల ద్వారా వర్షించు కృపారసవర్షములచే భక్తులను ఆనందింపచేయునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

రాజన్మత్తమరాలమన్దగమనాం రాజీవపత్రేక్షణాం
రాజీవప్రభవాదిదేవమకుటై రాజత్పదామ్భోరుహామ్|
రాజీవాయతపత్రమణ్డితకుచాం రాజాధిరాజేశ్వరీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే||౩||

మదించిన హంసవలే మెల్లగ నడచునది, తామరరేకుల వంటి కన్నులు కలది, బ్రహ్మమొదలగు దేవతలచే నమస్కరించబడు పాదపద్మములు కలది, విశాలమైన తామర రేకులతో అలంకరింపబడిన స్తనములు కలది, రాజాధిరాజులను కూడ శాసించునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

షట్తారాంగణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం
షట్చక్రాన్తరస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితామ్|
షట్చక్రాంతిచితపాదుకాంచితపదాం షడ్భావగాం షోడశీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే||౪||

నక్షత్రముల వలే ప్రకాశించు ఆరుఅక్షరముల మంత్రము నందు వెలుగొందుచున్నది, శివుని భార్యయైనది, అరిషడ్వర్గములను నశింపచేయునది, మూలాధారము మొదలగు ఆరు చిక్రములలో నుండునది, అమృతరూపమైనది, కాకిని మొదలగు ఆరు యోగినులచే చుట్టబడినది, ఆరు చక్రములు శోభిల్లు పాదుకలు ధరించిన పాదములు కలది, పుట్టుక మొదలగు ఆరు భావములను తొలగించినది, పదహారు అక్షరముల మంత్రస్వరూపమైనది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

శ్రీనాథాదృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం
గానాసక్తమనోజయౌవనలసద్గంధర్వకన్యాదృతామ్|
దీనానామతివేలభాగ్యజననీం దివ్యామ్బరాలఙ్కృతాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే||౫||

విష్ణువుచే ఆదరించబడుచూ మూడులోకములను పాలించుచున్నది, శ్రీచక్రము నందు సంచరించుచున్నది, యువతులైన గంధర్వకన్యలచే పాటలు పాడుచూ సేవింపబడుచున్నది, దీనులకు మిక్కిలి భాగ్యము నిచ్చునది, దివ్యవస్త్రములను ధరించినది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

లావణ్యాధికభూషితాఙ్గలతికాం లాక్షాలసద్రాగిణీం
సేవాయాతసమస్తదేవవనితాసీమన్తభూషాన్వితామ్|
భావోల్లాసవశీకృతప్రియతమాం భణ్డాసురచ్ఛేదినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే||౬||

అధిక సౌందర్యవంతమైన శరీరము కలది, లక్కవలే ఎర్రనైనది, నమస్కరించు దేవతాస్త్రీల తలలపై నున్న ఆభరణములతో ప్రకాశించుచున్నది, అనురాగముచే పరమేశ్వరుని వశీకరింపచేసుకున్నది, భండాసురుని
సంహరించినది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

ధన్యాం సోమవిభావనీయచరితాం ధారాధరశ్యామలాం
మున్యారాధనమోదినీం సుమనసాం ముక్తిప్రధానవ్రతామ్|
కన్యాపూజనసుప్రసన్నహృదయాం కాఞ్చీలసన్మధ్యమాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే||౭||

ధన్యురాలు, చంద్రునిలో ధ్యానింపదగిన చరిత్రము కలది, మేఘము వలే నల్లనైనది, మునుల చేయు ఆరాధనలతో సంతోషించునది, మహాత్మలకు ముక్తినిచ్చునది, కన్యకా పూజలు చేయువారి యందు ప్రసన్నమైన హృదయము కలది, ఓడ్డాణముతో ప్రకాశించు నడుము కలది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

కర్పూరాగరుకుఙ్కుమాఙ్కితకుచాం కర్పూరవర్ణస్థితాం
కృష్టోత్కృష్టసుకృష్టకర్మదహనాం కామేశ్వరీం కామినీం|
కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పాన్తరస్థాయినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే||౮||

కర్పూరము- అగరు- కుంకుమలు పూయబడిన వక్షస్థలము కలది, కర్పూరము వంటి శరీరచ్చాయ కలది, అన్ని విధములైన కర్మలను దహించివేయునది, శివుని భార్యయైనది, కోరికలు కలది, మన్మథుని తన కన్నులలో నింపుకున్నది, కరుణతో నిండిన హృదయము కలది, ప్రళయకాలము నందు కూడా స్థిరముగా నుండునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాన్ధర్వగానప్రియాం
గమ్భీరాం గజగామినీం గిరిసుతాం గన్ధాక్షతాలఙ్కృతామ్|
గంగాగౌతమగర్గసన్నుతపదాం గాం గౌతమీం గోమతీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే||౯||

స్తుతించినవారిని రక్షించునది, జెండాపై గరుడచిహ్నము కలది, ఆకాశము నందు సంచరించునది, గంధర్వగానమును ఇష్టపడునది, గంభీరమైనది, గజగమనము కలది, హిమవంతుని కుమార్తెయైనది, గంధము- అక్షతలతో అలంకరింపబడినది, గంగ- గౌతమ మహర్షి- గర్గుడు మొదలగు వారిచే స్తుతించబడు పాదములు కలది, గోవు- గౌతమి- గోమతి స్వరూపిణియైనది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.

జయ జయ శఙ్కర హర హర శఙ్కర

Read more...