Saturday, 30 June 2012

మాతృపంచక శ్లోకములు:

4 comments


౧. ముక్తామణిస్త్వం నయనం నమేతి రాజేతి జీవేతి చిరం సుత త్వం!
ఇతి ఉక్తవత్యాః తవవాచి మాతః దదామ్యాహం తండులమేవ శుష్కమ్!!

 
'నువ్వు నా ముత్యానివి, నా రత్నానివి, నా కంటి వేలుగువు, కుమారా! నువ్వు చిరంజీవివై వర్ధిల్లాలి' అని ప్రేమగా నన్ను పిలిచినా నీ నోటిలో అమ్మా, ఈనాడు కేవలం ఇన్ని ముడి బియ్యపు గింజలను వేస్తున్నాను.


౨.అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతికాలే కియదవోచ ఉచ్చైహ్!
క్రిష్ణేతి గోవిందేతి హరే ముకుందేతి అహో జనన్యై రచితోయమంజలిహ్!!


'అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!' అంటూ పంటి బిగువున ప్రసవ వేదనను భరించి నాకు జన్మనిచ్చిన తల్లీ! నీకు నమస్కరిస్తున్నాను.

౩.ఆస్తాం తావడియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యధా!
నైరుచ్యం తనుశోషణం మలమపి శయ్యా చ సాంవత్సరీ!
ఏకస్యాపి న్ గర్భభార భరణ క్లేశస్య యస్స్యాక్షమో!
దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః!!


అమ్మా! నన్ను కన్నా సమయంలో నువ్వు ఎంతటి శూల వ్యధను అనుభించావో కదా! కళను కోల్పోయి, శరీరం శుష్కించి, శయ్య మలినమైనా - సం!! కాలం ఆ క్లేశాన్ని ఎలా భరించావో కదా! ఎవరైనా అలాంటి బాధను సహించగలరా? ఎంత ఉన్నతుడైనా కుమారుడు తల్లి రుణాన్ని తీర్చుకోగాలడా? నీకు అంజలి ఘటిస్తున్నాను.

౪.గురు కులముపసృత్య స్వప్న కాలేపి తు దృష్ట్వా!
యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైహ్!
గురుకులముపసృత్య సర్వం ప్రరుదత్తే సమక్షం!
సదపి చరణయోస్తే మాతురస్తు ప్రణామః!!


స్వప్నంలో నన్ను సన్యాసి వేషంలో చూసి, కలతపడి, గురుకులానికి వచ్చి బిగ్గరగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడి వారందరికీ ఖేదం కలిగించింది. అంతటి ప్రేమమయివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నానమ్మా!

౫.న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా!
స్వ గావా నో దత్తా మరనదివసే శ్రాద్ధవిధినా!
న దత్తో మాతస్తే మరణ సమయే తారక మనురకాలే!
సంప్రాప్తే మయి కురు దయం మాతరతులాం!!


అమ్మా! సమయం మించి పోయాక వచ్చినందువల్ల మరణ సమయంలో గుక్కెడు నీళ్ళు కూడా నేను నీ గొంత్లో పోయలేదు. శ్రాద్ధ విధిగా గోదానమైనా చేయలేదు. ప్రాణోత్క్రమణ సమయంలో నీ చెవిలో తారక మంత్రాన్ని ఉచ్ఛరించలేదు. నన్ను క్షమించి, నా యందు తులలేని దయ చూపించు తల్లీ!

ఈ ఐదు స్లోకాశ్రు కణాల్లోనూ 'మాతృదేవో భవ' అనే గంభీర ఉపనిషద్వాణి ప్రతిష్టితమై ఉంది. మహిత వేదాంత ప్రవచానానికే కాదు - మహనీయ మాతృ భక్తి ప్రకటనకు కూడా ఆచార్యకం ఆదిశంకరుల వాణి.

4 comments:

Unknown said...

me krushiki naa abhinandanamulu

Harikrishna nukala said...

Dhanyavadamulu

yeggu.nukala said...

ayya..harikrishnagaru..ee MAATRUPANCHAKAM>>Chaa..la..bagundi so meeru slaghaneeyulu.

Harikrishna nukala said...

Dhanyavadamulu yeggu.nukala garu...

Post a Comment