Thursday, 4 August 2011

veerabhadra stotram వీరభద్ర స్తోత్రం

5 comments
(సతీదేవి అగ్నికి ఆహుతి కాగా శివ భగవానుడు తాండవము చేసి క్రోధాగ్ని ఉట్టిపడ వీరభద్రుని సృజించి యజ్ఞమును ధ్వంసము చేయనియోగించగా శ్రీ వీరభద్రుని విజృంభణ).

జయ జయ రుద్రావతార హే వీరభద్ర నీ కెదురివ్వరిలన్ || (పల్లవి)

ఉగ్రుని ఉగ్రమె వీరభద్రునిగ ఆకృతి దాల్చగ నృత్యములో |
రంకెలు వేయుచు గంతుల నెగురుచు ఖడ్గము త్రిప్పుచు హస్తముతో |
బయటకు వచ్చెను పింగళజటలవె ప్రళయాగ్ని శిఖలు తోచెడిగా |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర ! నీ కెదురివ్వరిలన్ ||

ప్రళయపయోధర కులములు నొకపరిచేరుచునురిమిన శబ్దముతో |
పటుతర గర్జనలోప్పగ ' దక్ష పిపీలికమా! ఎటనుంటివిరా ' ? |
అనుచుచు కేకల వేయుచు గగన పధంబున ప్రస్ధితుడైతివిగా |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర ! నీ కెదురివ్వరిలన్ ||

పదపద ఘాతమునందున మేఘము లెగురగ నక్షత్రంబులవే |
ధూళి కణంబులుగా పైకెగురుచు తారాధూమములుప్పతిలన్ |
భగ భగ మండెడి విస్ఫులింగములు కన్నుల వర్షముగా కురియన్ |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర ! నీ కెదురివ్వరిలన్ ||

నిను తిలకించిన దేవగణంబులు మనులును పరుగులు తీసిరిగా |
అదియె మహా ప్రళయంబదె వచ్చె నటంచుచు కేకలతో దిశలన్ |
మెలిదిరిగిన మీసములె కత్తులుగా ముఖమందున భీకరముల్ |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర ! నీ కెదురివ్వరిలన్ ||

ఋషులను సురలను పాదఘాతములఁ దన్నుచు వచ్చిన పాపముకై |
శివరహితంబగు క్రతువును చేయగ ఎంత పొగరనుచు గర్జనతో |
క్రతువున వెలిగెడి అగ్ని గుండమున ఉమ్మి వేసియట నార్పితివే |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర ! నీ కెదురివ్వరిలన్ ||

దక్షుని శిరమును తెంచితివచ్చట ఖడ్గముతో నావేశముతో |
ఛీ ఛీ తుచ్చాయని గాండ్రించుచు వ్యాఘ్రమురీతిగ దూకులతో |
ఉగ్ర విహారము చేయగ బ్రహ్మయు, హరియు నుతింప నిలచితివే |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర ! నీ కెదురివ్వరిలన్ ||

హే! కరుణార్ణవ ! దక్షుని జీవము నిచ్చితివప్పుడు శాంతుడవై |
విధి హరి యాచన మన్నించితివే దయతో నీ పదమందు పదన్ |
మేషముఖుండగు దక్షుడు నిన్ను నుతించగ వీరేశ్వర శరభా ! |
జయ జయ రుద్రావతార హే వీరభద్ర ! నీ కెదురివ్వరిలన్ ||

హే! కరిమర్దన ! హే క్రతుఖండన ! హే విషకంధర! నందిపతే |
హే! శశిశేఖర! హే ఫణిభూషణ ! హే కాలాంతక! స్కందగురో |
హే ! వీరేశ్వర ! హే పరమేశ్వర ! హే లయ తాండవ ! ప్రమధపతే! |
త్వాం ప్రణమామి మహేశ్వర ! శంకర ! పాలయ కింకర మీశ్వరమామ్‌ ||

వీరంభజే - వీరభద్రం భజే - రౌద్ర వికటాట్టహాసంభజే
కాళీపతే - భద్రకాళీపతే - రౌద్ర వికటాట్టాహసంభజే
శ్రీ భద్రకాళీ సహితం వీరభద్రం నమామ్యహమ్ |
కులదేవం ప్రసూతాత రూపాన్తర మివస్ధితమ్‌ ||

5 comments:

Anonymous said...

Hi,

Can you post this stotra in hindi (sanskrit or devnagri)

Regards,

Harikrishna nukala said...

I Will Try

विभावरी रंजन said...

sir,can you please post this stotra or any veerbhdra stotra in sanskrit?

Unknown said...

We have Veerabhadra astottram how to send

Unknown said...

Veerabhadra ashtakam kavali swamy

Post a Comment