మన పురాణ ఇతిహాసాలపై, కట్టుకథలు పిట్టకథలు చాలా ఉన్నాయి.
ఉదా : సినిమాల్లో " ఇంద్రుడు " అనగానే క్లబ్బు డాన్సులు, ఆయన్ని గందరగోళంగా చూపిస్తారు.
ఇంద్రుడు దేవతలకు రాజు కాబట్టి ఎవరైనా " తపస్సు " ఆచరిస్తే " కామానికి, క్రోధానికి " లొంగిపోతాడా ?
లేక భగవంతుని చేరుకుంటాడా ? అని పరీక్ష చేసే అధికారం ఆయనకి ఉంది. అందుకే రంభాది పరీక్షలు.
కల్పాన కథలు :
కవులు కూడా చాల కథలు సృష్టించారు.
౧] శ్రీ కృష్ణార్జున యుద్ధం
వారిద్దరు నర నారాయణులు అన్యోన్న్య ప్రీతి కలవారు.
పురాణాల్లో వీరికి యుద్ధం జరిగినట్టుగా ఎక్కడా లేదు
ఉదా : ఖాండవ వన దహన సమయంలో మయుడు అనే రాక్షసుని సంహరించడానికి,
శ్రీకృష్ణుడు చక్రాన్ని ప్రయోగిస్తాడు. అది చూసి మయుడు " అర్జునా రక్ష రక్ష " అంటాడు.
అర్జునుడు అభయం ఇవ్వగానే కృష్ణుడు తన సుదర్శనాన్ని ఉపసంహరించుకుంటాడు.
అసలు శ్రీ కృష్ణుడు " అర్ఘ్యం " వదలనూలేదు గంధర్వుని " నిష్టీవనం " పడనూ లేదు.
అర్జునుడు అభయం ఇస్తే కృష్ణుడు సంహరిస్తానని అనడు యుద్ధానికి రాడు. కేవలం,
కవుల కల్పితాలే ఇవన్నీ..
౨ ] శ్రీ కృష్ణ తులాభారం
మన సంస్కృతిలో పతినే ప్రత్యక్ష దైవంగా పూజిస్తాము
అలాంటిది పతిని దానం చేసే వ్రతం ఉంటుందా ?
మూలంలో లేని కథలన్నీ కల్పించి రాస్తే దాన్ని సినిమా వాళ్ళు,
మరి కొంచం మెరుగులు దిద్ది ప్రజల్లోకి వదిలారు.
సినిమా వాళ్ళు కూడా మన పురాణేతిహాస కథలను భ్రష్టు పట్టించారు.
౩] మాయా బజార్
అసలు బలరాముడికి " శశిరేఖ " అన్న కూతురే లేదు దానికి పెళ్లి తతంగం స్టంటు
అందుకే " మాయాబజార్ " అన్న పేరు పెట్టారేమో ?
౪] రామాంజనేయ యుద్ధం
ఇలాంటివి ఎన్నో సినిమాలు ఉండటం వల్ల ప్రజలు అవి వాస్తవం అని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు..
పాపం వాళ్లకి మాత్రం ఏమి తెలుసు..!
అందుకే " పురాణ గ్రంధాలు " చదవనిదే ఇది వాస్తవం అని నిర్ధారించు కోవద్దు..
హరి కృష్ణ
1 comments:
Nice post hari. Keep it up.
Post a Comment