మార్గావర్తిత పాదుకా పశుపతేరఙ్గస్య కూర్చాయతే
గణ్డూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే
కించిద్భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే
భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే
గణ్డూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే
కించిద్భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే
భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే
ఆహాహా ! ఏమి శివభక్తి మహిమ ! చిరకాలము దారిని నడిచిన పాత కాలిచెప్పు,
ఆ కాళహస్తీశ్వరునకు కనుబొమల నడుమ చోటు నేర్పరచుకున్నది. పుక్కిలించి
ఉమ్మిసిన నీరు ఆ త్రిపురారికి గంగా జలభిషేకమయ్యెను. సగము కొరికి తినగా
మిగిలిన మాంసపు ముక్క ఆ జగదీశ్వరునకు మహానివేదన ద్రవ్యమయ్యెను.
అడవులయందు దిరుగు కిరాతకుడు { కన్నప్ప } భక్తాగ్రగణ్యుడయ్యెను. భక్తి ఏమి చేయదు.?
0 comments:
Post a Comment