సీ: శ్రీ మనోహర! సురార్చిత! సింధుగంభీర!
భక్త వత్సల! కోటి - భానుతేజ!
కంజనేత్ర! హిరణ్యకశిపు నాశక! శూర!
సాధురక్షణ! శంఖచక్రహస్త!
ప్రహ్లాదవరద! పాపధ్వంస! సర్వేశ!
క్షీరసాగరశాయి! కృష్ణవర్ణ!
పక్షివాహన! నీలబృమరకుంతలజాల!
పల్లవారుణ పాదపద్మ యుగళ!
తే|| చారు శ్రీ చందనాగరు చర్చితాంగ!
కుందకుట్మలదంత! వైకుంఠ ధామ!
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
ఆరోజు శనివారము ప్రాత: సంధ్యా వందనము ముగించిన తరువాత,
మనసు ప్రశాంతంగా ఉంది. ఇంకా ఏదైనా చేస్తే / చదివితే బాగుండు,
అనిపించింది. ఆలోచన రాగానే అలమారాలో ఉన్న పుస్తకాలలో,
చేతికి అందిన పుస్తకము తీసుకున్నాను. అది శతక సంపుటము,
అనే పుస్తకము. అంది తెరిచి అందులో ఉన్న, " నరసింహ శతకము "
మొత్తం పారాయణ చేసి ముగించాను. ఆ తరువాత రోజువారి పనులలో,
నిమగ్నమైపోయాను. ఆరోజు రాత్రి నిదురించిన తరువాత స్వప్నములో,
నేను నా అనుజుడు పంట పొలములో నుండి అటువైపుగా వెళ్తున్నాము.
రెండు " సింహములు " అక్కడ నిలబడి అటువైపుగా తిరిగి ఉన్నాయి.
వాటి వెనుక భాగము మాత్రమే కనిపించి, వాటి లాంగూలములు,
అటూ ఇటూ తిప్పుతున్నాయి. ఆ దారిగుండా రైతులు వస్తు పోతూ ఉన్నారు.
మేము మాత్రము భయంతో అక్కడే నిలబడి పోయాము. అంతలో మెలుకువ,
రానే వచ్చింది.
ఈ స్వప్న వృత్తాంతం ద్వారా స్వామి ఏమి చెప్పదలుచు కున్నాడో, తెలియదు
కాని, దర్శనము మాత్రము ఒసగినాడు.
--
శ్రీ హరికృష్ణ శాస్త్రి.
0 comments:
Post a Comment