Friday, 4 May 2012

ఋణ విమోచన శ్రీ నృసింహ స్తోత్రం

0 comments
దేవతా కార్య సిధ్యర్థం సభాస్తంభ సముద్భవం
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

లక్ష్మ్యా లింగిత  వామాంగం భక్తానాం వరదాయకం
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజ విశనాశనం
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

సింహనాదేన మహతా దిగ్దంతిభయ నాశనం
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణం
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

క్రూరగ్రహై: పీదితానాం భక్తానామభయప్రదం
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే

వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాది వందితం
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే 

య ఇదం పఠతే నిత్యం ఋణ మోచన సంజ్ఞితం
అనృణీజాయతే సత్యో  ధనం శీఘ్ర మవాప్నుయాత్
Read more...

మాతంగి పద్యము

0 comments
 వినిపించె నేదేవి విమల గాంధర్వంబు
    మాణిక్య వీణపై మరులు గొలుప
సాక్షాత్కరించె నేజలజాక్షి కోమల
    శ్యామలామల తనూచ్ఛాయతోడ
సంగీత సాహితీ స్తనపటీర సుగంధ
    మీదేవి నీకైత నివతళించే
చూపించె నేదేవి సుఖ పరమావధి
    ఆనందకాననాభ్యంతరమున
ఏ మహాదేవి నాయందు కృప వహించి
   నన్ను రమణీయ రస జగన్నాథు జేసే
ఆ మహాశక్తి మాతంగి ప్రేమమూర్తి
    శ్యామలాదేవి నను సదా సాకు గాత ||

శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి
  
 
Read more...

శ్రీ నృసింహ జయంతి శుభాకాంక్షలు

0 comments
ప : నమిత దేవం భజే నారసింహం
సుముఖకరుణేక్షణం సులభనరసింహం
చ : విజయనరసింహం వీరనరసింహం
భుజబలపరాక్రమస్ఫుటనృసింహం
రజనీచరవిదళనవిరాజితనృసింహం
సుజనరక్షకమహాశూరనరసింహం
చ : దారుణనృసింహం ప్రతాపనరసింహం
చారుకల్యాణనిశ్చలనృసింహం
ధీరచిత్తావాసదివ్యనరసింహం
సారయోగానందచతురనరసింహం
చ : విమలనరసింహం విక్రమనృసింహం
కమనీయగుణగణాకరనృసింహం
అమితసుశ్రీవేంకటాద్రినరసింహం
రమణీయభూషాభిరామనరసింహం



                                                 పవనాశన పీఠాయ   గౌతమీ తీరవాసినే
                                                శ్రీమద్ధర్మపురీశాయ శ్రీ నృసింహయతే నమ: || 

                                          

                                     శ్రీ నృసింహ జయంతి శుభాకాంక్షలు

Read more...