Friday, 24 June 2011

ఈ అయిదు అమ్మవారి ప్రధానరూపాలు .

0 comments
శ్రీకృష్ణున్ని అవతరింపజేయటం కోసం లోకజనని అయిదురూపాలు ధరించింది . ఒక్కొక్క రూపానికి మళ్ళీ అనేక బేధాలున్నాయి .భక్తులను అనుగ్రహించటం కోసం ,తన బిడ్డలైన వారి అభ్యర్దన మేరకు ఎన్నెన్నో అవతారాలు ధరించింది అమ్మ. అయితే మూలప్రకృతినుంచి ఆవిర్భవించిన రూపాలు ప్రధానమైనవి మాత్రం ఇవి వాటిలో మొదటిరూపం శివప్రియ,గణేశమాతదుర్గ. శివరూప ,విష్ణుమాయ ,నారాయణి,పూర్ణబ్రహ్మ స్వరూపిణి ,సర్వాధిష్టాత్రి ,శర్వ రూప ,సనాతని,ధర్మసత్య,పుణ్యకీర్తి.యశోమంగళ దాయిని, సుఖమోక్ష,హర్ష...
Read more...

Wednesday, 22 June 2011

నీతి శ్లోక, పద్యములు

1 comments
మంగళాచరణమ్‌దిక్కాలాద్యనవచ్ఛిన్నానంత చిన్మాత్ర మూర్తయే । స్వానుభూత్యేక మానాయ నమః శాంతాయ తేజసే ॥ 1 తాత్పర్యము: త్రిలోకములూ, త్రికాలములూ, దశదిశలూ, అంతటా, అన్నిటా తానే అయి ఆత్మజ్ఞానుభవము చేత మాత్రమే గుర్తించదగిన జ్యోతిస్వరూప పరబ్రహ్మమునకు నమస్కారము. మూర్ఖపద్ధతిబోద్ధారో మత్సర గ్రస్తాః ప్రభవః స్మయ దూషితాః । అబోధోపహతాః చాన్యే జీర్ణమంగే సుభాషితమ్‌ ॥ అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః । జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి తం నరం న రంజయతి ॥ తాత్పర్యము:...
Read more...

Monday, 13 June 2011

పావులూరి మల్లన

0 comments
పావులూరి మల్లన తొలితరం తెలుగు కవి, గణితవేత్త. ఇతని కాలం స్పష్టంగా తెలియడంలేదు. ఇతను నన్నె చోడుని కాలం వాడని వాదాలున్నాయి. ఇతడు గణితసార సంగ్రహము అనె గణితగ్రంధాన్ని వ్రాశాడు. రాజరాజునుండి ఇతనికి నవఖండవాడ అగ్రహారం లభించిందట. తెలుగు పద్యానికి ఆరంభదశ అనుకొనే ఆ కాలంలోనే గణిత శాస్త్ర నియమాలను పద్యాలలో పొందుపరచడం సాధ్యమయ్యిందని ఇతని రచనల ద్వారాతెలుస్తున్నది. కాలంనాటివాడని, కాదు ఇతనిదని చెప్పబడుతున్న ఒక పద్యం శ్రీలలనేశు డాంధ్రనృపశేఖరుడై చను రాజరాజభూ- పలకుచేత బీఠపురి పార్శ్వమున న్నవఖండవాడ యన్ బ్రోలు విభూతితో బడసి భూరిజనస్తుతుడైన సత్కళా- శీలుడ రాజపూజితుడ శివ్వన పుత్త్రుడ మల్లనాఖ్యుడన్  గోదావరి...
Read more...

Sunday, 12 June 2011

హనుమాన్‌ చాలీసా పుట్టుక

2 comments
<a href='http://www.bidvertiser.com'>pay per click advertising</a తులసీదాసు రామభక్తుడు. నిరంతరం రామనామస్మరణలో, రామనామగానంలో మునిగి, బ్రహ్మానందం పొందేవాడు. ఆయనే కాదు, ఆ గానామృతానికి పరవశించిపోయిన అనేకమంది, తులసీదాస్‌ దగ్గరకు వచ్చి రామనామ దీక్ష తీసుకుని, నిరంతరం శ్రీరాముని స్మరిస్తూ ఆనందంలో ఓలలాడేవారు. కేవలం హిందువులే కాదు, ఇతర మతాలవారు కూడా తులసీదాస్‌ వద్ద...
Read more...

త్రైలింగస్వామి

0 comments
త్రైలింగస్వామి 1601వ సంవత్సరం లో ఆంధ్రదేశం లో జన్మించి సుమారు 280 సంవత్సరాలు జీవించిన మహాత్ముడు. వీరి తల్లిదండ్రులు నరసింగరావ్, విద్యావతి. స్వామి శివుడి అవతారంగా చెప్పబడ్డాడు. ఆయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరాం. స్వామి చిన్నప్పటినుండే మిగతా పిల్లల లాగ ఆటపాటలలో పాల్గొనకుండా ఎప్పుడూ ఏకాంతం కోరుకునేవాడు. తన తల్లి చెప్పే రామాయణ, మహాభారతాలు మొదలైన మతగ్రంథాలు ఎంతో ఆనందంగా వినేవాడు. ఇతను తన తల్లిదండ్రుల సేవలో 52 సంవత్సరాలు గడిపాడు. అప్పుడు తన...
Read more...

శివకేశవుల అభేదమును తెల్పు హరిహరనాధుని స్తుతితో తిక్కన భారతాన్ని ప్రారంభించాడు

0 comments
శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భ ద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి 'విష్ణు రూ పాయ నమశ్శివాయ' యని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్ధిక...
Read more...

భారతంలో నన్నయగారి చివరిపద్యం - శారదరాత్రుల వర్ణన

0 comments
శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్ జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరి పూరితంబులై ||శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. - అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనుపించటము లేదు - వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలి తో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి వంటి వెన్నెలను విరజిమ్ముతున్న...
Read more...

త్రిమూర్తులను వర్ణించు శ్లోకము

0 comments
రచన: నన్నయ్య  శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యేలోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాంతేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురైర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్శ్రేయసే...
Read more...

మనుచరిత్రలో సాయంకాల వర్ణన

0 comments
శా. శ్రేణుల్ గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు; లుష్ణాంశుపా     షాణ వ్రాతము కోష్ణమయ్యె; మృగతృష్ణావార్ధు లింకెన్; జపా     శోణం బయ్యెఁ బతంగ బింబము; దిశా స్తోమంబు శోభాదరి     ద్రాణం బయ్యె, సరోజషండములు నిద్రాణంబు లయ్యెం గడున్  ఆంధ్ర కవితా పితామహుడిగా పేరుపొందిన అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రము లోని తృతీయాశ్వాసం లోనిది ఈ పద్యం. ఇందులో కవి సాయంకాలాన్ని వర్ణిస్తున్నాడు. తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ చెరిగిపోని పేర్లలో అల్లసాని పెద్దన పేరు చాలా ముఖ్యమైంది. కృష్ణదేవ రాయని ఆస్థానం లోని అష్టదిగ్గజాలనే తెలుగు కవుల్లో పెద్దన అగ్రగణ్యుడు. రాయలవారికి...
Read more...

Tuesday, 7 June 2011

వెయ్యేళ్ళ తెలుగు పద్యం.

0 comments
మ. హరిదంభోరుహలోచన ల్గగనరంగాభోగరంగ త్తమో భర నేపథ్యము నొయ్య నొయ్య సడలింపన్, రాత్రి శైలూషికిన్ వరుసన్ మౌక్తికపట్టమున్, నిటలమున్, వక్తంబునుం దోఁచె నా హరిణాంకాకృతి వొల్చె రే కయి, సగం బై, బింబ మై తూర్పునన్. ఇది వసు చరిత్రలో రామరాజ భూషణుని చంద్రోదయ వర్ణన. వెయ్యేళ్ళ తెలుగు పద్యం పేరుమీదుగా ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో (1980 దశకంలో ) కీ.శే. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు నిర్వహించిన శీర్షికలోని తొట్టతొలి పద్యం. గగనరంగ మనే విశాల రంగస్థలం మీద రాత్రి అనే నట్టువకత్తె చూపించబోయే నాట్య ప్రదర్శనకు ముందుగా పద్మలోచనలు తాము పట్టుకున్న చీకటి అనే తెఱను మెల్లమెల్లగా సడలిస్తుండగా రాత్రి అనే...
Read more...

Monday, 6 June 2011

నవగ్రహ ధ్యాన శ్లోకములు

0 comments
శ్లో|| ఆరోగ్యం పద్మబన్ధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి:      భూలాభం భూమిపుత్రస్సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్య: |      సౌభాగ్యం దేవమన్త్రీ రిపుభయశమనం భార్గవశ్శౌర్యమార్కి:      దీర్ఘాయుస్సైంహికేయో విపులతరయశ: కేతురాచంద్రతారం || శ్లో|| అరిష్టాని ప్రణశ్యన్తు దురితాని భయాని చ |       శాన్తిరస్తు శుభం మేస్తు గ్రహా: కుర్వన్తు మంగళం |...
Read more...