నిర్దోషంబగు కర్మాచరణము
నిశ్చల భక్తిలో తన్మయ భావము
నిస్సంకల్పిత ధ్యాన విధానము
నిఖిలాదీశ్వర ప్రసాదించరా
అనవరతము నీ నామము తలచగ
ఆత్మలోన నీ మూర్తిని నిలుపగ
సర్వజీవులను దైవ రూపముగ
ఆరాధించెడు దశ నొసంగురా
ధర్మ మార్గమున జీవిత కాలము
ధైర్యముతో నడుచునట్లుగ
కర్మాధీశ్వర ఇంద్రియములను
క్రమపద్ధతిన నడిపింపుమురా
సత్యము శాంతము సహన మహింసయు
సమతా భావము సహజ విరాగము
సంకటములలో సౌమ్య విధానము
సర్వాధీశ్వర దయ చేయుమురా
నీవే తల్లివి నీవే తండ్రివి
నీవే గురువవు నీవే దైవము
నీవే తప్ప నాకితరము లేదని
నిన్నే నమ్మితి నన్ను బ్రోవరా
శ్రీ ప్రసన్నానంద స్వామి
నిశ్చల భక్తిలో తన్మయ భావము
నిస్సంకల్పిత ధ్యాన విధానము
నిఖిలాదీశ్వర ప్రసాదించరా
అనవరతము నీ నామము తలచగ
ఆత్మలోన నీ మూర్తిని నిలుపగ
సర్వజీవులను దైవ రూపముగ
ఆరాధించెడు దశ నొసంగురా
ధర్మ మార్గమున జీవిత కాలము
ధైర్యముతో నడుచునట్లుగ
కర్మాధీశ్వర ఇంద్రియములను
క్రమపద్ధతిన నడిపింపుమురా
సత్యము శాంతము సహన మహింసయు
సమతా భావము సహజ విరాగము
సంకటములలో సౌమ్య విధానము
సర్వాధీశ్వర దయ చేయుమురా
నీవే తల్లివి నీవే తండ్రివి
నీవే గురువవు నీవే దైవము
నీవే తప్ప నాకితరము లేదని
నిన్నే నమ్మితి నన్ను బ్రోవరా
శ్రీ ప్రసన్నానంద స్వామి
సేకరణ
పరంజ్యోతి
మల్లాది వేంకట కృష్ణమూర్తి గారి ఆధ్యాత్మిక నవల
పరంజ్యోతి
మల్లాది వేంకట కృష్ణమూర్తి గారి ఆధ్యాత్మిక నవల
శుభోదయం
--
శ్రీ హరికృష్ణ శాస్త్రి
0 comments:
Post a Comment