Saturday 18 August 2012

పద్యము

0 comments

నారద మహర్షి
`ధర్మము లెన్నియన్నియును ధారుణిలో వివరించినావు, ని
ష్కర్ములు యోగిసత్తము లకారణ మెవ్విభు నెల్ల వేళలన్
అర్మిలిమ్రొక్కి కీర్తనల నర్చనసేయుదు రట్టి మాధవున్
ధర్మధురీణ, సన్నుతు లొనర్పవు దానన లోటు వాటిలెన్'.

అంటూ వేద వ్యాసుని మనో వికలతకు కారణ మెరింగించి,


`చిత్తమునందు శ్రీ విభుని జేర్చి భజింపుము, విష్ణులీలన్

హత్తగనిమ్ము నీ యెడద, నాత్మ హరింగను, కృష్ణ వర్ణనా
యత్తము సేయు నీ పలు, కనంత జనంబు తరించినట్లు లో
కోత్తర కీర్తి చెప్పుము బుధోత్తమ, భాగవతాఖ్య సంహితన్'.

కవిసమ్రాట్ శ్రీ నోరి నరసింహ శాస్త్రి   

0 comments:

Post a Comment