గృహస్థజీవనము
సృష్టిలోని ప్రాణులలో మానవజన్మ ఎంతో విశిష్టమైనది అనే విషయాన్ని నరత్వం దుర్లభం లోకే, ప్రాణినాం నరజన్మ దుర్లభం, దుర్లభో మానుషో దేహః వంటి శావాక్యాలు ధ్రువపరు స్తున్నాయి. ఈ మానవజన్మ పూర్వజన్మలలోని పుణ్యఫలంగా లభిస్తుంది మానుష్యం పుణ్య సంచయాత్ అని చెప్పబడింది.
మనుష్య జీవనము బ్రహ్మచర్య-గృహస్థ-వానప్రస్ థ-సన్యా సము అనే నాలుగు విభాగములతో కూడినది. వేదవేదాంగాది విద్యా సముపార్జనకై ఉద్దేశింపబడినది బ్రహ్మచర్యము.
బ్రహ్మచారి విద్యాభ్యాసం తరువాత ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీః అనే
శ్రుతివాక్యరూపమైన గురూపదేశాన్ని పురస్కరించుకొని యథా యోగ్యమైన కన్యను
అన్వేషించి ఆమెను వివాహం చేసుకొని గృహ స్థ జీవనాన్ని
కొనసాగించవలెను.బ్రహ్మచర్య- గృహస్థ-వానప్రస్థ-సన్యా
సాశ్రమములలో ఏది ముఖ్యమైనది అనే చర్చ ఉదయించి నప్పుడు, ఏది గొప్పదని తూకం
వేసి చూసినట్లయితే బ్రహ్మచర్య- వానప్రస్థ-సన్యాసములు అనే మూడు ఒక ఎత్తు
కాగా, గృహస్థజీవనము ఒక్కటియే మరొక ఎత్తు అని పండితులు నిర్ణయించి
చెప్పుదురు -
ఆశ్రమాం స్తులయా సర్వాన్ ధృతానాహుర్మనీషిణః
ఏకతశ్చ త్రయో రాజన్ గృహస్థాశ్రమ ఏకతః ॥
అనే మహాభారతసూక్తి తెలియజేయుచున్నది.
గృహస్థుడే పశుపక్ష్యాదులను, సర్వప్రాణులను పోషించునట్టివాడు. అందుకే గృహస్థుడే శ్రేష్ఠడు - వయాంసి పశవశ్చైవ భూతాని చ జనాధిప గృహైస్థెరేవ ధార్యంతే తస్మాచ్ఛ్రేష్ఠో గృహాశ్రమీ ॥ అని వ్యాసమహర్షి ధర్మరాజునకు బోధించెను.
మండువేసవిలో పక్షులు, జంతువులు, బాటసారులు వీరు, వారు అనే భేదం లేకుండా ప్రాణుల న్నీ ఒక మహావృక్షాన్ని ఆశ్రయించి తమ తాపాన్ని పోగొట్టుకున్నట్లే బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు అందరూ సంస్కారవంతుడైన గృహస్థుని ఆశ్రయించి ఉంటారని శాస్త్రోక్తి.
ఈ గృహస్థుడు యజ్ఞయాగాది వైదిక క్రియాకలాపముల ద్వారా దేవతలను సంతృప్తిపరచును, శ్రాద్ధకర్మలతో పితృదేవతలను, సద్గ్రన్థపఠనముతో మహర్షులను, ఆదరాభిమానములతో అతిథు లను గౌరవించును. గృహస్థుడు జ్ఞాన-వయో-శీల వృద్ధులైన తల్లిదండ్రులను, గురువులను గౌర విస్తూ, గోదాదేవి తిరుప్పావై ప్రబంధంలో ఐయముం పిచ్చైయుం అని పేర్కొన్న రీతిలో యోగ్యు లను దానమును సెలుపుతూ, యాచకులను సంతృప్తిపరచే విధంగా ధర్మమును ఆచరిస్తూ, ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించగలిగిన యోగ్యత, శక్తి కలవాడు.
అందుకే ఒక కవి ధన్యో గృహస్థాశ్రమః అని పేర్కొన్నాడు. సమాజానికి శ్రేయస్సును కలిగిం చే రీతిలో గృహస్థజీవనాన్ని కొనసాగించే దిశగా ప్రయత్నిద్దాం.
సృష్టిలోని ప్రాణులలో మానవజన్మ ఎంతో విశిష్టమైనది అనే విషయాన్ని నరత్వం దుర్లభం లోకే, ప్రాణినాం నరజన్మ దుర్లభం, దుర్లభో మానుషో దేహః వంటి శావాక్యాలు ధ్రువపరు స్తున్నాయి. ఈ మానవజన్మ పూర్వజన్మలలోని పుణ్యఫలంగా లభిస్తుంది మానుష్యం పుణ్య సంచయాత్ అని చెప్పబడింది.
మనుష్య జీవనము బ్రహ్మచర్య-గృహస్థ-వానప్రస్
కొనసాగించవలెను.బ్రహ్మచర్య-
ఆశ్రమాం స్తులయా సర్వాన్ ధృతానాహుర్మనీషిణః
ఏకతశ్చ త్రయో రాజన్ గృహస్థాశ్రమ ఏకతః ॥
అనే మహాభారతసూక్తి తెలియజేయుచున్నది.
గృహస్థుడే పశుపక్ష్యాదులను, సర్వప్రాణులను పోషించునట్టివాడు. అందుకే గృహస్థుడే శ్రేష్ఠడు - వయాంసి పశవశ్చైవ భూతాని చ జనాధిప గృహైస్థెరేవ ధార్యంతే తస్మాచ్ఛ్రేష్ఠో గృహాశ్రమీ ॥ అని వ్యాసమహర్షి ధర్మరాజునకు బోధించెను.
మండువేసవిలో పక్షులు, జంతువులు, బాటసారులు వీరు, వారు అనే భేదం లేకుండా ప్రాణుల న్నీ ఒక మహావృక్షాన్ని ఆశ్రయించి తమ తాపాన్ని పోగొట్టుకున్నట్లే బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు అందరూ సంస్కారవంతుడైన గృహస్థుని ఆశ్రయించి ఉంటారని శాస్త్రోక్తి.
ఈ గృహస్థుడు యజ్ఞయాగాది వైదిక క్రియాకలాపముల ద్వారా దేవతలను సంతృప్తిపరచును, శ్రాద్ధకర్మలతో పితృదేవతలను, సద్గ్రన్థపఠనముతో మహర్షులను, ఆదరాభిమానములతో అతిథు లను గౌరవించును. గృహస్థుడు జ్ఞాన-వయో-శీల వృద్ధులైన తల్లిదండ్రులను, గురువులను గౌర విస్తూ, గోదాదేవి తిరుప్పావై ప్రబంధంలో ఐయముం పిచ్చైయుం అని పేర్కొన్న రీతిలో యోగ్యు లను దానమును సెలుపుతూ, యాచకులను సంతృప్తిపరచే విధంగా ధర్మమును ఆచరిస్తూ, ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించగలిగిన యోగ్యత, శక్తి కలవాడు.
అందుకే ఒక కవి ధన్యో గృహస్థాశ్రమః అని పేర్కొన్నాడు. సమాజానికి శ్రేయస్సును కలిగిం చే రీతిలో గృహస్థజీవనాన్ని కొనసాగించే దిశగా ప్రయత్నిద్దాం.
0 comments:
Post a Comment