Saturday, 11 August 2018

పాలంకలోయలో వీరభద్రుడు

0 comments
మనసుకు ఆహ్లదాన్నిచ్చే నల్లమల్ల అరణ్యంలొ పకృతి అందాల మద్య ఉన్న పాలంక క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా విరజిల్లుతొంది...'ఏటా తొలి ఏకాదశి పర్వదినాన మూడురొజుల పాటు స్వామివారికి పూజలు చేస్తారు...ఈ క్షేత్రం ఎన్నో వింతలు వినోదాలకు నెలవు. అటువంటి పాలంక వీరభద్ర స్వామి వార్షిక తిరునాళ్ళు ఫైప్రత్యేక కధనం ప్రకాశం జిల్లా "యర్రగొండపాలెం" మండలం నల్లమల అడవులలో పాలంక లోయలో వీరభదృడు కొండ చరయల కింద గుహలో కొలువైయ్యాడు... ప్రతి సవత్సరం...తొలి ఏకాదశిని పురస్కరించుకొని..వైభవం...
Read more...

Thursday, 5 May 2016

శివాపరాధాక్షమా స్తోత్రము తెలుగు

7 comments
తెలుగు అనువాదము : శ్రీ దువ్వూరి v n సుబ్బారావుగారు  శ్రీ శంకర భగవత్పాదులకు పాదాభివందనములతో............. తొల్లి కర్మల వశమున తల్లి గర్భ వాస నరకమ్ము నొందితి పాప మంట మూత్ర మలముల మధ్యన మునిగి యుంటి కాల్చె జఠరాగ్ని తనువును గాఢముగను. అప్పు డెంతటి దుఃఖమో చెప్ప తరమె ? నీకు తెలియదా నాబాధ నిజముగాను ? నిన్ను స్మరియింప లేదని నింద మోపి తప్పు లెన్నగ శంకరా తగదు నీకు. బాల్యమున పొర్లితిని మల పంకిలమున దప్పిగొని స్తన్య పానాన తగిలియుంటి...
Read more...

Wednesday, 4 May 2016

సంకల్ప బలం.(కథ)...

4 comments
. సుమారు రెండువేల సంవత్సరాల క్రిందట పురాతన గ్రంధములలో ఉల్లేఖించబడిన ఒక కధ వున్నది. అది కధ అయినా దాని వలన ఒక ప్రేరణ మనకు ప్రాప్తిస్తుంది- శ్రీ గౌడపాదాచార్యులవారు తన గ్రంధంలో దీనిని ఉదహరించారు. ఆ కధ ఏమంటే - సముద్రపు ఒడ్డున ఉన్న రాతి గుహల్లో ఒక చిన్న పక్షి వుండేది. అది సముద్రపు ఒడ్డున తన గుడ్లు పెట్టుకుంది. ఒకరోజు సముద్రంలో అలలు పొంగి ఆ గుడ్లు కొట్టుకుని పొయాయి. అప్పుడు ఆ పక్షి ఏడుస్తూ కూర్చోలేదు. ఓదార్చడానికి వచ్చి పోయే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోలేదు....
Read more...

గ్లాసుడు నీళ్ళు (అనుశ్రుత గాథ)

1 comments
ఒక సన్న్యాసి అదృష్ట వశాత్తూ భగవంతుడిని కలుసుకున్నాడు.భగవంతుడి చిరునవ్వు నవ్వి నీకేం కావాలినాయనా అని అడిగాడు.ఆ సన్న్యాసి నాకు సత్యాన్ని తెలుసుకోవాలని వుంది.సత్యాన్ని బోధించండి.అన్నాడు.దానికి భగవంతుడు చూడు బాబూ!యిప్పుడు చాలా వేడిగా వుంది కదా ఒక గ్లాసుడు నీళ్ళు తెచ్చిపెట్టు.నీరు త్రాగి నీకు బోధిస్తాను అన్నాడు. అక్కడికి దగ్గరగా గ్రామం కానీ,ఇళ్ళు కానీ లేవు.చాలా దూరం నడిచి వెళ్లి ఒక యిల్లు కనబడితే వెళ్లి తలుపు తట్టాడు.లోపలినుండి ఒక అందమైన కన్య వచ్చింది.సన్నటి...
Read more...

ఒక చిన్న కథ

0 comments
ఒక వూరిలో పేద బ్రాహ్మణ దంపతులు నివసించే వారు.అతనికి మ్వున్న ఎకరా పొలములో పండిన వడ్లు అమ్ముకొని జీవించేవాడు ఆమె యిరుగు పొరుగు యిళ్ళలో వంట చేస్తూ వుండేది.ఒకసారి ఆ బ్రాహ్మణుడు పొరుగూరిలో ఏదో సంతర్పణ జరుగుతూందని వెళ్ళాడు.అక్కడ వాళ్ళు బూరెలు చేసి వడ్డించారు.అవి అతనికి చాలానచ్చాయి.యింతకు ముందు యివి తిననేలేదు,యింటికి వెళ్లి నా భ్గార్య తో వండించుకొని తింటాను.అనుకోని వడ్డించే అతన్ని అయ్యా!వీటి పేరేమి?అని అడిగాడు అతను వీతినిబూరేలంటారు అన్నాడు అతను.తనవూరికి...
Read more...

సూక్తిముక్తావళి పుస్తకం నుండి

0 comments
శ్లోకం:-చిత్రామృతం నా మృత మేవ విద్ధి చిత్రానలం నానలమేవ విద్ధిచిత్రాంగనా నూన మనంగ నేతి వాచా వివేక స్త్వ వివేక ఏవః  అర్థము:ఓ రామచంద్రా! చిత్ర పటమందలి అమృతము అమృతము గాదు,చిత్ర పట మందలి అగ్ని అగ్ని కాదు,చిత్ర పట మందలి స్త్రీ, స్త్రీ గాదు,అట్లే వాచా వివేకము,వివేకము గాదు. అది అవివేకమే యగును. అనుస్టానము లేని వేదాంత బోధలన్నియు ఇట్లే యుండును. అంటే ఆచరణ లేని బోధల వల్ల ప్రయోజనము లే దు. (పటము లోని వానివలె నిష్ప్రయోజనములు)(సూక్తిముక్తావళి పుస్తకం నుండి) గాయంతి...
Read more...

మశక దశన మధ్యే వారణా సంచరంతి" దోమ దంతాల మధ్య ఏనుగులు తిరుగాడు తున్నాయి శర్మ గారి పూరణ

0 comments
నాగఫణి శర్మగారి ద్విశతావ ధానం 1990 లో రవీంద్ర భారతిలో జరిగింది.అది చాలా చిన్నది చాల యిరుకు.అప్పుడు ఒక సంస్కృత సమస్య యిచ్చారు."మశక దశన మధ్యే వారణా సంచరంతి" దోమ దంతాల మధ్య ఏనుగులు తిరుగాడు తున్నాయిశర్మ గారి పూరణ విపుల రహిత దేశే శ్రీ రవీంద్ర ప్రదేశేద్వి శత సుకవి మాన్యా: సంచరంతీతి చిత్రంఇద మద పరి దృశ్య ప్రౌడ విద్యా వదంతిమశక దశన మధ్యే వారణా: సంచ రంతి అర్థము:-- ఇరుకైన యీ రవీంద్ర భారతి లో పృచ్చకులుగా వచ్చిన 200 వందల మంది పండితులు అటూ యిటూ తిరుగాడుతున్నారు. .ఆ దృశ్య మెలా వుందంటే దోమ దంతాల మధ్య ఏనుగులు తిరుగాడు తున్నట్టు వుంది.చప్పట్లతో సభ మారు మ్రోగింది. అప్పుడు ఏలూరిపాటి అనంతరామయ్యగారు .కానీ...
Read more...

శ్రీ దీపాలపిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము"

0 comments
మనసిజుని మామ మామ యభిమానండంచిన వాని మామ నామ్ దనుని విరోధి నందనుని నందను సుందరి మేనమామ జంపిన జగజ్జెట్టి బోడి జేసినా శూరుని తండ్రి గన్నుగన్గొనిన సురాధినాథుని తనూభవు వాయువు మీకు నయ్యెడున్ భారతము,భాగవతము లోని కథలు తెలిసిన వారు ఈ పద్యములోని వ్యక్తులను గుర్తించి వారిని యిందులో పొదిగిన తీరుకు ఆశ్చర్యపోతారు.ఇంతకూ యిది ఆశీరమృతాన్ని కురిపిస్తున్న పద్యము.ఈ చాటువు వ్రాసిన కవి ఎవరో కానీ తన పద్యము చదివిన వాళ్ళను దీవిస్తున్నాడు.శ్రీ దీపాలపిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము"లోనిదీ పద్యము. తా:--మనసిజుని మామ=చంద్రుడు,అతని మామ దక్షప్రజాపతి, అభిమానాన్ని అంటే గర్వాన్ని అణచిన వాడు శివుడు, ఆ శివునికి మామ...
Read more...