Wednesday, 4 May 2016

గ్లాసుడు నీళ్ళు (అనుశ్రుత గాథ)

1 comments

ఒక సన్న్యాసి అదృష్ట వశాత్తూ భగవంతుడిని కలుసుకున్నాడు.భగవంతుడి చిరునవ్వు నవ్వి నీకేం కావాలి
నాయనా అని అడిగాడు.ఆ సన్న్యాసి నాకు సత్యాన్ని తెలుసుకోవాలని వుంది.సత్యాన్ని బోధించండి.
అన్నాడు.దానికి భగవంతుడు చూడు బాబూ!యిప్పుడు చాలా వేడిగా వుంది కదా ఒక గ్లాసుడు నీళ్ళు తెచ్చిపెట్టు.నీరు త్రాగి నీకు బోధిస్తాను అన్నాడు. అక్కడికి దగ్గరగా గ్రామం కానీ,ఇళ్ళు కానీ లేవు.చాలా దూరం నడిచి వెళ
్లి ఒక యిల్లు కనబడితే వెళ్లి తలుపు తట్టాడు.లోపలినుండి ఒక అందమైన కన్య వచ్చింది.
సన్నటి నడుము, కలువరేకుల్లాంటి కళ్ళు ,చంద్రబింబం లాంటి ముఖం.అతను అంత అందమైన అమ్మాయిని అతను యింతవరకూ చూడలేదు.అతని వైపు చూసి అందంగా చిరునవ్వు నవ్వింది.అలా నవ్వుతూ వుంటే యింకా అందంగా కనిపించింది.అంతే తాను వచ్చిన పని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకుంటావా?అని అడిగాడు.ఆ కన్య అంగీకారంగా తల వూచింది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు.రోజులు గడిచిపోతున్నాయి చాలా మంది పిల్లలు కలిగారు.ఎంతకాలం గడిచి పోయిందో వాళ్లకి తెలియనేలేదు.
ఇలా వుండగా ఒకరోజు పెద్ద గాలీ వాన ఒకటే ధార.ఊరూ వాడ ఏకమై పోయాయి.(హుదూద్ తుఫాన్ లాగ)చెట్లు పడిపోయాయి,ఇళ్ళు కూలిపోయాయి.భార్యా పిల్లలతో అతడు ప్రవాహములో నడుచుకుంటూ పోతున్నాడు.ప్రవాహం వేగంగా వుంది.ఎక్కడా గట్టు దొరకడం లేదు.అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు.'భగవంతుడా రక్షించు'అని మొరపెట్టుకున్నాడు.భగవంతుడు అతడి మొర విని నేను అడిగిన గ్లాసుడు నీళ్లేవీ?అని అడిగాడు.
ప్రతిమానవుడు సత్యాన్వేషణ రేపో ఎల్లుండో చేద్దామని కాలం లో చిక్కుకుంటాడు.కాలం లో చిక్కుకొనినివసించడం అలవాటయి పోయింది.కాలం రెండు విధాలు


1.గడియారం సూచించే కాలమానం

 2.మనస్సు కల్పించే మానసిక కాలం.నిన్న,ఈ రోజు,రేపు అనేవి మనస్సు నిర్మించినవి.నిన్న జరిగిన సంఘటనలు యిప్పుడు లేవు."నిన్న''గతించినట్లే అవి గతించాయి.కానీ ఆ సంఘటనలు జ్ఞాపకం చేసుకొని యిప్పుడు జరుగుతున్నట్టే భావించి ప్రవర్తించే వాళ్ళు చాలామంది వున్నారు.రేపు యింకా రాలేదు కానీ ఈ రోజున జరిగిన సంఘటనలు రేపు కూడా
జరుగుతాయేమోనని ఊహించుకొని భయపడే వాళ్ళూ చాలా మందే వున్నారు.నిజానికి నిన్నా లేదు,రేపూ లేదు,వర్తమానమే ఎప్పుడూ వుండేది.మానసిక కాలమే మిధ్య.

1 comments:

jaya's said...

హరహర శంకర
జయజయ శంకర

Post a Comment