Wednesday, 4 May 2016

ఒక చిన్న కథ

0 comments
ఒక వూరిలో పేద బ్రాహ్మణ దంపతులు నివసించే వారు.అతనికి మ్వున్న ఎకరా పొలములో పండిన వడ్లు అమ్ముకొని జీవించేవాడు ఆమె యిరుగు పొరుగు యిళ్ళలో వంట చేస్తూ వుండేది.ఒకసారి ఆ బ్రాహ్మణుడు పొరుగూరిలో ఏదో సంతర్పణ జరుగుతూందని వెళ్ళాడు.అక్కడ వాళ్ళు బూరెలు చేసి వడ్డించారు.అవి అతనికి చాలానచ్చాయి.యింతకు ముందు యివి తిననేలేదు,యింటికి వెళ్లి నా భ్గార్య తో వండించుకొని తింటాను.
అనుకోని వడ్డించే అతన్ని అయ్యా!వీటి పేరేమి?అని అడిగాడు అతను వీతినిబూరేలంటారు అన్నాడు అతను.
తనవూరికి బయల్దేరాడు దోవలో అంతా ఆ పేర
ు మర్చిపోతానేమో నని బూరెలు బూరెలు అని అనుకుంటూ . నడుచుకుంటూ పోతున్నాడు.దోవలో ఒక మురికి కాలువ అడ్డం వచ్చింది.దాన్ని దాటడానికి వెనక్కి వెళ్లి వేగంగా పరుగెత్తు కుంటూ వచ్చి 'దసినిత్త' అంటూ ఆ కాలువని దాటాడు (అది అతని ఊతపదం)తర్వాత
బూరెలు అందం మర్చిపోయి దసినిత్త దసినిత్త అనుకు తో యింటికి వెళ్ళాడు.
భార్యతో ఏమే అక్కడ సంతర్పణలో దసినిత్తలు చేశారు.ఎంత బాగున్నాయనుకున్నావు.అవి నువ్వుకూడా
చెయ్యి బాగుంటుంది.అన్నాడు.ఆవిడ 'దసినిత్త'లేమిటండీ నేనెప్పుడూ దాని పేరైనా వినలేదు.అనింది భార్య.యిన్ని చోట్లకు వంటలకు వెడుతుంటావు నీకు 'దసినిత్త 'లంటే తెలియదా మరీ వేషాలు వెయ్యకు
తెలియక పొతే పక్కింటి వాళ్ళని ఎలా చెయ్యాలో కనుక్కొని చెయ్యి.అన్నాడు.ఆవిడ తెలిసినవాల్లన్దరినీ అడిగింది అందరూ ఎప్పుడూ ఆ పేరు గల పిండివంట విననే లేదు అన్నారు.అదే విషయం మొగుడికి చెప్పింది.అతనికి చాలా కోపం వచ్చింది చెయ్యడానికి సోమరితనం నీకు యేవో కుంటిసాకులు చెప్తున్నావు అని కర్ర తీసుకొని బాగా కొట్టాడు పెళ్ళాన్ని.ఆమెకు చేతులంతా వాచిపోయి మూలుగుతూ పడుకుంది.
యింతలో పోరుగింటావిడ దేనికోసమో వచ్చి చూచి అయ్యో యిదేమిటే యిలా కొట్టావు?చెయ్యి చూడు బూరెల్లా వాచి పోయింది. అనింది.అప్పుడు ఆ బ్రాహ్మడు ఆ ఆ అవే బూరెలు చెయ్యమంటే చెయ్యడం లేదు అందుకనే కొట్టాను. అన్నాడు.అయ్యో బోరేలని చెప్తే చెయ్యనా?యేవో దసినిత్తలు దసినిత్తలు అంటే
నాకెలా తెలుస్తుంది?అన్నది భార్య.అయ్యో పేరు మర్చిపోయానే అని భార్యను కొట్టినందుకు సిగ్గు పది క్షమాపణ అడిగి,వైద్యుడి దగ్గరకు వెళ్లి మందు తెచ్చి భార్య చేతికి పట్టించాడు,వైద్యుడు యిచ్చిన మాత్రలు కూడా యిచ్చి వేసుకోమన్నాడు.నొప్పి తగ్గాక రెండు రోజులకు ఆవిడ బూరెలు చేసింది.యిద్దరూ కడుపునిండా తిన్నారు.తొందర పడి ఎవరినీ తిట్టారాదు,కొట్టరాదు.నోటిని చేతిని అదుపులో పెట్టుకోవాలి

0 comments:

Post a Comment