నిత్యానందకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘొరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ|ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౧||
నిత్యమైన
ఆనందము నిచ్చుదానవు, వరములను- అభయమును ప్రసాదించు దానవు, సౌందర్య
సముద్రమైన దానవు, ఘొరమైన పాపముల నన్నిటినీ కడిగి వేయుదానవు, హిమవంతుని
వంశమును పవిత్రము చేయుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి,
అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపెట్టుము.
నానారత్నవిచిత్రభూషణకరీ హేమామ్బరాడమ్బరీ
ముక్తాహారవిడమ్బమానవిలసద్వక్షొజకుమ్భాన్తరీ|
కాశ్మీరాగరువాసితాఙ్గరుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౨||
వివిధ
రత్నముల విచిత్రాభరణములను ధరించినదానవు, బంగారు వస్త్రములను కట్టుకున్న
దానవు, వక్షస్థలముపై ప్రకాశించు ముత్యాల హారములు ధరించిన దానవు, కుంకుమ-
అగురులు పూసుకొనుటచే సువాసనలు వేదజల్లు శరీరము కలదానవు, కాశి పట్టణమునకు
రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపెట్టుము.
యొగానన్దకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చన్ద్రార్కానలభాసమానలహరీ త్రైలొక్యరక్షాకరీ|
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౩||
యోగముచే
పొందు ఆనందమును కలిగించుదానవు, శత్రువులను నాశనం చేయు దానవు, ధర్మనిష్టను
ఏర్పరచుదానవు, చంద్రుడు- సూర్యుడు- అగ్నులతొ సమానమైన కాంతి ప్రవాహమైనదానవు,
మూడులొకములను రక్షించుదానవు, సమస్త్యైశ్వర్యములను ప్రసాదించుదానవు,
తపస్సులకు ఫలమునిచ్చుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి,
అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపెట్టుము.
కైలాసాచలకన్దరాలయకరీ గౌరీ హ్యుమా శాఙ్కరీ
కౌ మారీ నిగమార్థగొచకరీ హ్యొంకారబీజాక్షరీ|
మొక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౪||
కైలాస
పర్వత గుహయందుడు దానవు, తేల్లని దానవు, ఉమాదేవివి, శంకరుని భార్యవు,
కుమారివి, వేదార్థమును భొధించు దానవు, ఒంకార బీజాక్షరస్వరూపము కలదానవు,
మొక్షద్వారపు తలుపులను తేరచేడి దానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి,
తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపెట్టుము.
దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాణ్డభాణ్డొదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాఙ్కురీ|
శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౫||
కనబడీ
కనబడని మహిమలు కలదానవు, గర్బమునందు బ్రహ్మాండములను మొయుచున్న దానవు,
లీలానాటకమునకు సూత్రధారివి, విజ్ఞానదీపమును వేలిగించుదానవు, పరమేశ్వరుని
ఆనందింపచేయుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి,
అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.
ఆదిక్షాన్తసమస్తవర్ణనికరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ|
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాదీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౬||
’అ’
కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరముల సముదాయమైన దానవు,
పరమేశ్వరునకు ప్రియురాలవు, శంకరుని భార్యవు, కాశ్మీర త్రిపురేశ్వరివి,
మూడుకన్నులు కలదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి,
అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.
ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీలసమానకున్తలధరీ నిత్యాన్నదానేశ్వరీ|
సాక్షాన్మొక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౭||
భూమియందలి
సమస్తజనులకు నాయకురాలవు, విజయమునిచ్చుదానవు, తల్లివి, దయాసముద్రమైనదానవు,
స్త్రీమూర్తివి, నల్లని కురులు కలదానవు, నిత్యము అన్నదానము చేయుదానవు,
సాక్షాత్తుగా మొక్షమునిచ్చుదానవు, ఏల్లప్పుడు శుభము కలిగించు దానవు, కాశి
పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు
భిక్షపెట్టుము.
దేవీ సర్వవిచిత్రరత్నరుచిరా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయొధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౮||
దేవివి,
విచిత్రములైన సర్వరత్నములతొ అలంకరింపబడినదానవు, దక్షుని కుమార్తేవు,
సుందరివి, యువతివి, మధురమైన పాలిండ్లు కల దానవు, ప్రియమునిచ్చుదానవు, కాశి
పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు
బిక్షపెట్టుము.
చన్ద్రార్కానలకొటికొటిసదృశీ చన్ద్రాంశుబిమ్బాధరీ
చన్ద్రార్కాగ్నిసమానకుణ్డలధరీ చన్ద్రార్కవర్ణేశ్వరీ|
మాలాపుస్తకపాశసాఙ్కుశకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౯||
కోట్లాది
చంద్రులు, సూర్యులు, అగ్నులతొ సమానముగా ప్రకాశించుదానవు, సూర్యబింబము వలే
ఏర్రనైన క్రింది పేదవి కలదానవు, చంద్రుడు, సూర్యుడు, అగ్నుల వలే ప్రకాశించు
కుండలములు ధరించిన దానవు, చంద్రుడు, సూర్యుడు వంటి వర్ణము కలదానవు, కాశీ
పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు
భిక్షపెట్టుము.
క్షత్రత్రాణకరీ మహాభయహరీ మాతా కృపాసాగరీ
సర్వానన్దకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ|
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౧౦||
వీరులను
రక్షించుదానవు, మహాభయంకరివి, తల్లివి, దయా సముద్రమైన దానవు, అందరికీ
ఆనందము కల్గించు దానవు, ఏల్లప్పుడు శుభము కల్గించు దానవు, విశ్వమునకు
రాణివి, శొభిల్లు దానవు, దక్షప్రజాపతికి(యాగనాశనము ద్వారా) దుఃఖమును
కల్గించుదానవు, సుఖము నిచ్చుదానవు, కాశీ పట్టణమునకు రాణివి, దయామయివి,
తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు భిక్షపెట్టుము.
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే|
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి||౧౧||
ఓ అన్నపూర్ణా| ఎల్లప్పుడు పూర్ణముగా ఉండు తల్లి| శంకరుని ప్రాణవల్లభురాలా| పార్వతీ| జ్ఞానము వైరాగ్యము సిద్ధించుటకు భిక్షపెట్టుము.
మాతా చ పార్వతీ దేవి పితా దేవొ మహేశ్వరః|
బాన్ధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్||
తల్లి పార్వతీ దేవి, తండ్రి పరమేశ్వరుడు, బంధువులు శివభక్తులు, మూడులోకములు స్వదేశము.