కర్ణాటక రాష్ట్రం లో పడమటి కనుమలలో వున్న దివ్య క్షేత్రమే శృంగేరి .ఋష్య శృంగ మహర్షి పావనం చేసిన ప్రదేశం .శృంగ గిరే శృంగేరి గా మారింది .ఆది శంకరా చార్యులు ఇక్కడ శారదా పీఠం నెలకొల్పారు .శారదాలయానికి కుడి ప్రక్కన విద్యా శంకరాలయం వుంది .శ్రీ విద్యారణ్య స్వామి గురువు శ్రీ విద్యా శంకరులు..105 సంవత్స రాలు పీఠాది పత్యం వహించిన పుణ్య పురుషులు .అందుకని శిష్యుడు కృతజ్ఞత గా ఈ ఆలయాన్ని కట్టించారు .ఇది 1338 లో నిర్మిత మైంది . ముఖ మండపం లో 12 రాతి స్తంభాలున్నాయి .ఇవి 12 రాశుల పేర్లతో వుంటాయి .సూర్యుడు ఏ రాశి లో ప్రవేశిస్తే ,ఆ పేరు గల స్థంభం మీద ఆ రోజున సూర్య కిరణాలు పడటం ఇక్కడ విశేషం .ఖగోళ ,జ్యోతిష ,గణిత ,వాస్తు శాస్త్రాలలో అపూర్వ పాండిత్యం గల శిల్పులు మలచిన అద్భుత విన్యాసం .స్తంభాల పై సింహం ఆకారం లో జీవ మృగ మూర్తులున్డటం విచిత్రం .వాటి నోటిలో వ్రేలాడే రాతి బంతులు ,పై కప్పు నుంచి వేలాడే రాతి గొలుసులు ,అన్నీ ఒకే శిలతో నిర్మింప బడి ఉండటం ఆశ్చర్య కరం .ఆలయం బయట గోడలు కోణాలు ,కోణాలుగా చెక్క బడి వుండటం ఇంకో విచిత్రాను భూతి .పొడ వైన రాతి పలకలు ప్రక్క ప్రక్కగా నిలబెట్టి అతికించి నట్లు గా అని పిస్తుంది .ఇక్కడి శిల్ప సంపద అసదృశం గా వుంటుంది .
Sunday, 8 July 2012
శృంగేరి

Subscribe to:
Post Comments (Atom)
1 comments:
Chaala Baagunnadi.!! Thanks
Post a Comment