శ్రీ రామక్రుష్ణపరమహంసయొక్క గ్రుహస్థ శిష్యులలో నాగమహాశయుడను నాతడు చాల ముఖ్యుడు. సన్యాసి శిష్యులలో వివేకనందుడు చాలా గొప్పవాడు. నాగమహాశయుడు పరమభక్తుడు, వివేకానందుడు పరమజ్ణాని. ఒకడు 'దాసోహం' మార్గావలంబి, మరియొకడు 'శివో2హం' పథగామి. ఒక పండితుడు వారిగురించి ఇట్లు వర్ణించెను.
'మాయ' అను మహాశ్రుంఖలము (గొలుసు) నాగమహాశయుని, వివేకనందుని ఇరువురిని కట్టివైచినది. కాని నాగమహాశయుడు తన కాయముని చిన్నదిగ, చిన్నదిగ తగ్గించుకొనుచువచ్చి తుట్టతుదకు ఒక చిన్న పురుగువంటి ఆక్రుతికలవాడై ఆ గొలుసు యొక్క రింగులోని సందుగుండా దూరి పారిపోయెను. వివేకానందుడో, తన శరీరమును పెద్దదిగా, పెద్దదిగా కావించుకొని, విజ్రుంభించి ఆ గొలుసును బ్రద్దలు చేసి పారిపోయెను.
ఈ విదముగా ఇరువురును మాయా బంధనము నుండి విముక్తిని బడసిరి. నాగమహాశయుడు భక్తి భావనగల్గి తన అహంకారమును చంపుకొని:
త్వద్భ్రుత్య భ్రుత్య పరిచారక భ్రుత్య భ్రుత్య
భ్రుత్యస్యభ్రుత్త్య ఇటి మాం స్మర లొకనాథ
'దెవా! నేను నీ దాసానుదాస తద్దాసానుదాసదాసుడను' అని భగానుని కీర్తించుచు తన ఉపాధిని తన మనస్సును చిన్నదిగ, చెన్నదిగ చేసి కొని తుదకు పరంత్మయందు లయింపజేసెను.
జ్ణానమార్గావలంబియగు వివేకానందుడు.
మత్తో నాన్యత్కించిదత్రాస్తి విశ్వం
సత్యం బాహ్యం వస్తు మాయోపక్లుప్తం
ఆదర్శాంతర్భాసమానస్య తుల్యం
మయ్యద్వైతే భాతి తస్మాచ్ఛివో2హం
ఈ ప్రపంచము నాకంటె అన్యముగ ఒకింతైనను లేదు. మాయచే ఈ ప్రకారముగ అది బాహ్యమున కల్పింపబడియున్నది. అద్దమున వస్తువెట్లు కల్పితమై భాసించునో అట్లే అద్వయమగు నాయందీ జగత్తు మిథ్యా రూపమున భాసించుచున్నది. కావున ద్వైతము లేదు. పరమాత్మయే కలదు. అట్టి ఆద్వయ శివస్వరూప పరమాత్మనే నేను అని ఎలుగెత్తి పాడుచు తన ఉపాధిని (మనస్సును) విశాల మొనర్చి, విశాల మొనర్చి తుట్టతుదకు అనంత పరమాత్మగనే భాసిల్లెను.
పరిటాల గోపీకృష్ణ గారి సహకారంతో.
0 comments:
Post a Comment