Wednesday 11 July 2012

కళ్యాణ వృష్టిస్తవః

1 comments
కల్యాణవృష్టిభిరివామృతపూరితాభి-
ర్లక్ష్మీస్వయంవరణమఙ్గళదీపికాభిః|
సేవాభిరమ్బ తవ పాదసరొజమూలే
నాకారి కిం మనసి భాగ్యవతాం జనానామ్||౧||
      కళ్యాణములను వర్షించునవీ, అమృతముతొ నిండినవీ, లక్ష్మి స్వయముగా ప్రాప్తించు నట్టి మంగళములను చూపించునవీ, అగు నీ పాదపద్మముల సేవలచే భాగ్యవంతులైన జనుల యొక్క మనస్సునందు ఏమేమి కల్గింప బడలేదు?
  ఏతావదేవ జనని స్పృహణీయమాస్తే
త్వద్వన్దనేషు సలిలస్థగితే చ నేత్రే|
సాన్నిధ్యముద్యదరుణాయుతసొదరస్య
త్వద్విగ్రహస్య పరయా సుధయా ప్లుతస్య||౨||
 
   ఓ తల్లీ| నిన్ను నమస్కరించునపుడు కన్నులు ఆనంద బాష్పములతొ నిండుగాక. పదివేల సూర్యుల సమానమైనదీ, అమృతముతొ నిండినదీ, అగు నీ దివ్యస్వరూపము యొక్క సాన్నిధ్యము కలుగుగాక. ఇది మాత్రమే నా కొరిక.
 
ఈశత్వనామకలుషాః కతి వా న సన్తి
బ్రహ్మాదయః ప్రతిభవం ప్రలయాభిభూతాః|
ఏకః స ఏవ జనని స్థిరసిద్ధిరాస్తే
యః పాదయొస్తవ సకృత్ప్రణతిం కరొతి||౩||
      ఈశ్వరుడు (ప్రభువు) అను పేరును కలుషితము చేయుచూ ప్రతి జన్మము నందును వినాశమును పొందు బ్రహ్మ మొదలగు దేవతలేందరు లేరు? నీపాదములకు ఒక్కసారి ఏవడు నమస్కరించునొ ఒ జననీ| వాడే స్థిరమైన సిద్దిని పొందగలడు.
 
లబ్ధ్వా సకృత్త్రిపురసున్దరి తావకీనం
కారుణ్యకన్దలితకాన్తిభరం కటాక్షమ్|
కన్దర్పకొటిసుభగాస్త్వయి భక్తిభాజః
సంమొహయన్తి తరుణీర్భువనత్రయేపి||౪||
 
ఓ త్రిపురసుందరీ| కారుణ్యముతొ నిండినదీ, కాంతివంతమైనదీ, అగు నీ కటాక్షమును ఒక్కసారి పొంది నీ భక్తులు కొటి మన్మథసమానులై ముల్లొకములందలి యువతులను సమ్మొహ పరచుచున్నారు.
 
హ్రీంకారమేవ తవ నామ గృణన్తి వేదా
మాతస్త్రికొణనిలయే త్రిపురే త్రినేత్రే|
త్వత్సంస్మృతౌ యమభటాభిభవం విహాయ
దీవ్యన్తి నన్దనవనే సహలొకపాలైః||౫||
 
   త్రికోణము నందు నివసించు ఓ తల్లీ| త్రిపుర సుందరీ| మూడు కన్నులు ఉన్న దానా| నీ నామమగు హ్రీంకారమునే వేదములు వర్ణించుచున్నవి. నీభక్తులు నిన్ను స్మరించుచూ యమభటుల పరాభవమును వదలి నందనవనము నందు లొకపాలులతొ క్రీడించుచున్నారు.
  హన్తుః పురామధిగళం పరిపీయమానః
క్రూరః కథం న భవితా గరలస్య వేగః|
నాశ్వాసనాయ యది మాతరిదం తవార్థం
దేహస్య శశ్వదమృతాప్లుతశీతలస్య||౬||
 
   ఓ తల్లీ| అమృతముతొ తడిసి చల్లనై న నీ దేహము పరమేశ్వరుని అర్ధశరీరమై తాపమును చల్లార్చనిచొ త్రిపురాంతకుడగు శివుడు కంఠము నిండుగా త్రాగిన గరళము యొక్క తీవ్రత ఏంత క్రూరముగా ఉండేదొ కదా|
 
సర్వజ్ఞతాం సదసి వాక్పటుతాం ప్రసూతే
దేవి త్వదఙ్ఘ్రిసరసీరుహయొః ప్రణామః|
కిం చ స్ఫురన్మకుటముజ్జ్వలమాతపత్రం
ద్వే చామరే చ మహతీం వసుధాం దదాతి||౭||
 
 ఓ దేవి| నీ పాదపద్మములకు చేసిన నమస్కారము సర్వజ్ఞత్వమును, సభలొ వాక్పాటవమును కలిగించును. అంతేకాక మేరుస్తున్న కిరీటమును, ఉజ్జ్వలమైన తేల్లని గొడుగును, రేండు పక్కల వింజామరలను, విశాలమైన భూమిని(రాజ్యాధికారమును) ఇచ్చును.
  కల్పద్రుమైరభిమతప్రతిపాదనేషు
కారుణ్యవారిధిభిరమ్బ భవత్కటాక్షైః|
ఆలొకయ త్రిపురసున్దరి మామనాథం
త్వయ్యేవ భక్తిభరితం త్వయి బద్ధతృష్ణమ్||౮||
      ఓ తల్లీ| త్రిపురాసుందరీ| కొరికలు తీర్చు కల్పవృక్షములు, కరుణా సముద్రములు అగు నీ కటాక్షముతొ అనాథయైన, నీ పై ఆశలు పేట్టుకున్న నన్ను చూడుము.
హన్తేతరేష్వపి మనాంసి నిధాయ చాన్యే
భక్తిం వహన్తి కిల పామరదైవతేషు|
త్వామేవ దేవి మనసా సమనుస్మరామి
త్వామేవ నౌ మి శరణం జనని త్వమేవ||౯||
 
    అన్య మానవులు ఇతరులైన చిన్న దేవతల పై మనస్సులనుంచి భక్తి పేంపొందించుకొనుచున్నారు. ఒ దేవి| నేను మనస్సుతొ నిన్నే స్మరించుచున్నాను. నిన్నే నమస్కరించుచున్నాను. ఒ తల్లీ| నీ వే శరణము.
 
లక్ష్యేషు సత్స్వపి కటాక్షనిరీక్షణానా-
మాలొకయ త్రిపురసున్దరి మాం కదాచిత్|
నూనం మయా తు సదృశః కరుణైకపాత్రం
జాతొ జనిష్యతి జనొ న చ జాయతే చ||౧౦||
 
    ఓ త్రిపుర సుందరీ| నీ కటాక్షవీక్షనములకు గమ్యస్థలములు ఏన్ని ఉన్ననూ నన్ను ఒక్కసారి చూడుము.నాతొ సమానముగా దయచూపదగినవాడు పుట్టలేదు, పుట్టబొడు, పుట్టుట లేదు.
 
హ్రీం హ్రీమితి ప్రతిదినం జపతాం తవాఖ్యాం
కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసే|
మాలాకిరీటమదవారణమాననీయా
తాన్సేవతే వసుమతీ స్వయమేవ లక్ష్మీః||౧౧||
 
    ఓ త్రిపుర సుందరీ| ’హ్రీం’ హ్రీం’ అని ప్రతిదినమూ జపించువారికి లభించినది ఈ లొకములొ ఏమి కలదు? పుష్పమాల, కిరీటము, మదపుటేనుగులతొ విరాజిల్లు భూదేవి శ్రీదేవి స్వయముగనే వారిని సేవించును.
 
సమ్పత్కరాణి సకలేన్ద్రియనన్దనాని
సామ్రాజ్యదాననిరతాని సరొరుహాక్షి|
త్వద్వన్దనాని దురితాహరణొద్యతాని
మామేవ మాతరనిశం కలయన్తు నాన్యమ్||౧౨||
 
    పద్మముల వంటి కన్నులు కల ఒ త్రిపుర సుందరీ| నేకు చేయు వందనములు సంపదలను కలిగించును. ఇంద్రియములన్నిటికీ సంతొషము నిచ్చును. సామ్రాజ్యములనిచ్చును. పాపములను తొలగించును. ఒ తలీ నీ నమస్కార ఫలితము ఏల్లప్పుడు నన్ను పొందుగాక.
 
కల్పొపసంహృతిషు కల్పితతాణ్డవస్య
దేవస్య ఖణ్డపరశొః పరభైరవస్య|
పాశాఙ్కుశైక్షవశరాసనపుష్పబాణా
సా సాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా||౧౩||
 
    ఓ త్రిపురసుందరీ| ప్రళయకాలమునందు తాండవము చేయుచూ గండ్రగొడ్డలిని చేపట్టిన పరమేశ్వరునకు సాక్షిగా పాశము-అంకుశము-చేరకువిల్లు-పుష్పబాణము ధరించిన నీ స్వరూప మొక్కటే నిలబడుచున్నది.
 
లగ్నం సదా భవతు మాతరిదం తవార్ధం
తేజః పరం బహులకుఙ్కుమ పఙ్కశొణమ్|
భాస్వత్కిరీటమమృతాంశుకలావతంసం
మధ్యే త్రికొణనిలయం పరమామృతార్ద్రమ్||౧౪||
 
    అమ్మా| తేజొవంతమైనదీ, కుంకుమతొ ఏర్రనైనదీ, ప్రకాశించు కిరీటమును ధరించినదీ, చంద్రకళను తలపై అలంకరించుకున్నదీ, త్రికొణము యొక్క మధ్యలొనున్నదీ, అమృతముతొ తడిసినదీ, అగు నీ అర్ధశరీరము ఏల్లప్పుడు నా మనస్సునందు లగ్నమగు గాక.
 
హ్రీంకారమేవ తవ నామ తదేవ రూపం
త్వన్నామ దుర్లభమిహ త్రిపురే గృణన్తి|
త్వత్తేజసా పరిణతం వియదాది భూతం
సౌఖ్యం తనొతి సరసీరుహసమ్భవాదేః||౧౫||
 
ఓ త్రిపుర సుందరీ| ’హ్రీం’ కారమే నీ పేరు. నీ రూపము. అది దుర్లభమైనదని చేప్పుచుందురు. నీ తేజస్సుచే ఏర్పడిన ఆకాశము మొదలగు పంచ భూతసముదాయము బ్రహ్మ ముదలగు సమస్త జీవరాశికి సుఖమును కల్గించుచున్నది.
 
హ్రీంకారత్రయసమ్పుటేన మహతా మన్త్రేణ సన్దీపితం
స్తొత్రం యః ప్రతివాసరం తవ పురొ మాతర్జపేన్మన్త్రవిత్|
తస్య క్షొణిభుజొ భవన్తి వశగా లక్ష్మీశ్చిరస్థాయినీ
వాణీ నిర్మలసూక్తిభారభరితా జాగర్తి దీర్ఘం వయః||౧౬||


    ఓ తల్లీ| మూడు ’హ్రీం’ కారములతొ సంపుటితమైన మహామంత్రముతొ వేలుగొందుచున్న ఈ స్తొత్రమును ప్రతిరొజూ నీ ముందు నిలబడి ఏ మంత్తవేత్త జపించునొ అతనికి రాజులేల్లరు వశులగుదురు.లక్ష్మి చిరస్థాయిగా నుండును. నిర్మలమైన సూక్తులతొ నిండిన సరస్వతి ప్రసన్నురాలగును.చిరాయువు కలుగును.
 
 
                        హర హర శంకర జయ జయ శంకర
 
                       హర హర శంకర జయ జయ శంకర

1 comments:

Unknown said...

Vagdevatamasraye!

Post a Comment