Wednesday 4 May 2011

తుంగభద్రానదిని వర్ణించు పద్యము

3 comments

గంగా సంగమ మిచ్చగించునె మదిన్ గావేరీ దేవేరిగా
నంగీకార మొనర్చునే యమునతో నానందముంబొందునే
రగత్తుంగ తరంగ హస్తముల నారత్నాకరేంద్రుండు నీ
యంగంబంటి సుఖించునేని గుణభద్రా తుంగభద్రానదీ!
                                         

3 comments:

Ganti Lakshmi Narasimha Murthy said...

ఈ పద్యం తెనాలి రామకృష్ణుని పాండురంగ మహాత్యములోనిది.తుంగభద్రలో స్నానంచేస్తే అలాంచి అనుభవం కలగడం సామాన్యమే-గంటి లక్ష్మీనరసింహమూర్తి

Koundinya Sai said...

ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు మాత్రం తుంగభద్ర దయనీయ స్థితిలో ఉంది

Koundinya Sai said...

తుంగభద్రా నది కృష్ణకి ఉపనది.ప్రత్యక్షంగా తుంగతో సంగమం కలగలేదు కాబట్టే ఇతరులతో సరి పెట్టుకుంటున్నాడు సమద్రుడు అని రామకృష్ణుని ఉత్ప్రేక్ష.కానీ యమునతో కూడా ప్రత్యక్ష సంగమం సముద్రుడికి లేదు కదా! మరి యమునతో ఆనందమున్ బొందునే అని ఎలా చెప్పారు?

Post a Comment