
తెలుగు అనువాదము : శ్రీ దువ్వూరి v n సుబ్బారావుగారు
శ్రీ శంకర భగవత్పాదులకు పాదాభివందనములతో.............
తొల్లి కర్మల వశమున తల్లి గర్భ
వాస నరకమ్ము నొందితి పాప మంట
మూత్ర మలముల మధ్యన మునిగి యుంటి
కాల్చె జఠరాగ్ని తనువును గాఢముగను.
అప్పు డెంతటి దుఃఖమో చెప్ప తరమె ?
నీకు తెలియదా నాబాధ నిజముగాను ?
నిన్ను స్మరియింప లేదని నింద మోపి
తప్పు లెన్నగ శంకరా తగదు నీకు.
బాల్యమున పొర్లితిని మల పంకిలమున
దప్పిగొని స్తన్య పానాన తగిలియుంటి...