Saturday, 24 December 2011

విశ్వామిత్ర

0 comments
బ్రహ్మతేజోబలంబు రూపము ధరించి, బ్రహ్మసృష్టికి ప్రతిసృష్టి పరగజేసి, మంత్రగాయత్రి దర్శించి మహిమ జూపు,  బ్రాహ్మణుండ! విశ్వామిత్ర! భక్తి గొలుతు...
Read more...

Monday, 7 November 2011

0 comments
సాక్షాత్తు శివున్నే ధరించినవాడు ఎవ్వడు? శివుడు గజ చర్మాన్నే ఎందుకు ధరిస్తాడు? అనే విషయాలను ఈ కథ సందర్భం తెలియచేస్తుంది. పూర్వం కుమారస్వామితో తారకాసుర వధ జరిగిన తరువాత లోకాలన్నీ ఎంతో సుఖంగా ఉన్నాయి. తరువాత అదే తారకాసుర వంశంలో జనించిన వాడే గజాసురుడు. ఇతడు బ్రహ్మ ద్వారా వరాలు పొంది మూడులోకాలను జయించి వాటిని పాలించసాగాడు. ఇది దేవతలకు ఇబ్బందిగా పరిణమించింది. అంతేకాక గజాసురుడు గొప్ప శివభక్తుడు. ఇతడు నిత్యం శివారాధన చేసేవాడు. ఇదిలా ఉండగా ఒకనాడు నారదుడు గజాసురుడి కొలువుకి వచ్చి గజాసురుడి మర్యాదకు ప్రసన్నుడై, నిరంతర శివభక్తి కలిగిన నీవు స్వయం శివున్నే నీ హృదయాన ప్రతిష్టించుకో...అని సూచన చేసాడు. ఇది గొప్ప...
Read more...

Monday, 24 October 2011

0 comments
శ్రీ శంకరా! దేవ! శ్రీ కంధరా! శైవ సద్భావనా పూర! సద్భక్త సద్బుద్ధి సంచార! సాకార! ఓంకార! గంభీర! శ్రీ భావజాకార సంహార! జ్యోత్స్నాకరావాస సత్కేశ సంపన్న యోగీశ్వరా! భృంగి సంగేశ్వరా! లింగ రూపేశ్వరా! తుంగ గంగాధరా! శ్రీ హరా! పార్వతీ దేవి ప్రాణేశ్వరా! రాజ రాజేశ్వరా! శీత శైలేశ్వరా! శాత శూలేశ్వరా! భూత జాలేశ్వరా! రుద్ర భూమీశ్వరా! రౌద్ర కాలేశ్వరా! భద్ర కాళీశ్వరా! ఫాల నేత్రేశ్వరా! భవ్య నామేశ్వరా! దివ్య ధామేశ్వరా! సర్వ కామేశ్వరా! సప్త లోకేశ్వరా! నాయకా! నర్తనానంద సంధాయకా! నాగ రాజేంద్ర సద్భూషణా! భీషణా! పోషణా! శ్రీ శివా! శ్రీ భవా! శ్రీశ! కోటీశ్వరా! శ్రీ త్రికూటేశ్వరా! భూరి విశ్వేశ్వరా! పాహిమాం! పాహిమాం! పాహి సర్వ...
Read more...

Wednesday, 21 September 2011

తంత్రసార:

0 comments
స్త్రీరూపాం చింతయే ద్దేవీం పుంరూపం వా విచిన్తయేత్ | అథవా  నిష్కలం ధ్యాయే   త్సచ్చిదానంద   లక్షణమ్ ||                                                           తంత్రసార:  स्त्री  रूपाम्  चिन्तये  द्देवीं  पुंरूपं वा   विचिन्तयेत...
Read more...

Friday, 19 August 2011

దేవీ స్తుతి

0 comments
యా దేవీ సర్వభూతేషు చేతనే త్యభిధీయతే నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || యా దేవీ సర్వభూతేషు క్షుదారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || యా దేవీ సర్వభూతేషు చాయారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా...
Read more...

Sunday, 7 August 2011

ముగురమ్మల మూలపుటమ్మ

0 comments
అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె ద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనము్మల నుండెడి యమ్మ, దుర్గ మా యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్‌   అని బమ్మెర పోతనామాత్యుడు పరాత్పర అయిన ఆ ఆదిశక్తిని ఆరాధించాడు. భారతీయ ఆధ్యాత్మిక భావ భూమిక మహాశక్తి ప్రాతిపదికనే ఏర్పడింది. ఈ విశ్వంలో సమస్త సృష్టికి ఆమెయే చైతన్యం. ఆమెయే బుద్ధి, ఆమెయే నిద్ర.. మూల ప్రకృతి స్వరూపిణి ఆమె. త్రిమూర్తులైన సృష్టి, స్థితి,...
Read more...

Thursday, 4 August 2011

ఆధ్యాత్మిక సాధనకు మూలం నమ్మకం

1 comments
మార్చి 7, 2011 ద్వారా రవిచంద్ర అభిప్రాయములు ప్రహ్లాదుడు గొప్ప విష్ణుభక్తుడు. ఆయన తండ్రి హిరణ్యకశిపుడు అతన్ని విష్ణువును ప్రార్థించకుండా ఉండటానికి సర్వ విధాలా ప్రయత్నించాడు. కానీ ఆ శ్రీ మహా విష్ణువు పట్ల అతనికున్న తిరుగులేని భక్తి విశ్వాసాల ముందు ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. అతను చిన్నతనం నుంచే మహాఋషుల ఉపన్యాసాలను శ్రద్ధగా ఆలకించేవాడు. తల్లి గర్భంలో ఉండగా నారదుడు వచ్చి ఆమెకు విష్ణు ప్రవచనాలను వినిపిస్తుండేవాడు. ఆమె ఒక్కోసారి...
Read more...

Dakshina murthy stotram దక్షిణామూర్తి స్తోత్రము

0 comments
విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ తస్మై...
Read more...

veerabhadra stotram వీరభద్ర స్తోత్రం

5 comments
(సతీదేవి అగ్నికి ఆహుతి కాగా శివ భగవానుడు తాండవము చేసి క్రోధాగ్ని ఉట్టిపడ వీరభద్రుని సృజించి యజ్ఞమును ధ్వంసము చేయనియోగించగా శ్రీ వీరభద్రుని విజృంభణ). జయ జయ రుద్రావతార హే వీరభద్ర నీ కెదురివ్వరిలన్ || (పల్లవి) ఉగ్రుని ఉగ్రమె వీరభద్రునిగ ఆకృతి దాల్చగ నృత్యములో | రంకెలు వేయుచు గంతుల నెగురుచు ఖడ్గము త్రిప్పుచు హస్తముతో | బయటకు వచ్చెను పింగళజటలవె ప్రళయాగ్ని శిఖలు తోచెడిగా | జయ జయ రుద్రావతార హే వీరభద్ర ! నీ కెదురివ్వరిలన్ || ప్రళయపయోధర కులములు నొకపరిచేరుచునురిమిన...
Read more...

Thursday, 28 July 2011

భరత మాత

0 comments
కొమ్మల మీది కోయిలలుకుత్తుకలెత్తి  స్వతంత్ర  భావ సూ త్రమ్ముల కట్టసాగి  మమతన్ ప్రణయాంబర చిత్రశాలలున్కమ్మని జీవితానుభవగాథలు స్వాదుకథాపదేశామార్గమ్ములు కర్ణరంజకముగా వినిపించెడు నేడు భార...
Read more...

Thursday, 7 July 2011

పుష్ప విలాపం

2 comments
కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి చే విరచించబడి, ఘంటసాల వేంకటేశ్వర రావు గారి చే గానం చేయబడిన ఈ పుష్ప విలాపం నాకెంతో ఇష్టమైనది.... చేతులారంగ నిన్ను పూజించుకొరకు కోడి కూయంగనే మేలుకొంటి నేను; గంగలో ముంగి ధౌత వల్కలము గట్టి పూలు కొనితేర నరిగితి పుష్పవనికి నేనొక పూలమొక్కకడ నిల్చి చివాలున కొమ్మవంచి గో రానెడునంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా ప్రాణము దీతువా?" యనుచు బావురు మన్నవి - కౄంగిపోతి, నా మానసమందెదో తళుకు మన్నది "పుష్పవిలాప" కావ్యమై. తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి అమ్ముకొందువె మోక్షవిత్తమ్ము కొరకు! హౄదయమే లేని నీ పూజ లెందుకోయి? జడమతుల...
Read more...

Wednesday, 6 July 2011

వినాయకుడి ప్రార్ధనలు

0 comments
వినాయకుని ప్రార్ధనలు ఇన్నీ అన్నీ అని చెప్పజాలము. ప్రతి పనికీ, రచనకూ ముందు వినాయకుని ప్రార్ధించడం ఆనవాయితీ గనుక దాదాపు ఎన్ని పద్యకావ్యాలున్నాయో అన్ని ప్రార్ధనా పద్యాలున్నాయి. ఇక సంప్రదాయ శ్లోకాలు సరేసరి. కాని తెలుగువారికి అత్యంత పరిచయమున్న పద్యమిది. తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌. కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌. మరొక పద్యం కూడా విద్యార్ధులకు ఉచితమైనది. తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా వలపటి చేతి...
Read more...

అన్నమయ్య కీర్తనలు, రచనలు

0 comments
సుప్రసిద్ధ తెలుగు కవి పండితుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో చెప్పాలంటే "అన్నమయ్య రచనలు ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిధ్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన దివిపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే." అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము,...
Read more...

భారత మాత

0 comments
దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. దేశాన్ని మాతగా కీర్తిస్తూ, లయాన్వితింగా సాగిపోయే ఈ గేయం అప్పుడూ ఇప్పుడూ ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఈ గీతాన్ని కాకినాద ప్రభుత్వ కళాశాలలొ లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు వారి విద్యార్దులకోసం కృష్ణశాస్త్రి వ్రాసారు.   జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి! జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి! జయ జయ జయ..... జయ జయ సశ్యామల సుశ్యామల...
Read more...

Friday, 24 June 2011

ఈ అయిదు అమ్మవారి ప్రధానరూపాలు .

0 comments
శ్రీకృష్ణున్ని అవతరింపజేయటం కోసం లోకజనని అయిదురూపాలు ధరించింది . ఒక్కొక్క రూపానికి మళ్ళీ అనేక బేధాలున్నాయి .భక్తులను అనుగ్రహించటం కోసం ,తన బిడ్డలైన వారి అభ్యర్దన మేరకు ఎన్నెన్నో అవతారాలు ధరించింది అమ్మ. అయితే మూలప్రకృతినుంచి ఆవిర్భవించిన రూపాలు ప్రధానమైనవి మాత్రం ఇవి వాటిలో మొదటిరూపం శివప్రియ,గణేశమాతదుర్గ. శివరూప ,విష్ణుమాయ ,నారాయణి,పూర్ణబ్రహ్మ స్వరూపిణి ,సర్వాధిష్టాత్రి ,శర్వ రూప ,సనాతని,ధర్మసత్య,పుణ్యకీర్తి.యశోమంగళ దాయిని, సుఖమోక్ష,హర్ష...
Read more...

Wednesday, 22 June 2011

నీతి శ్లోక, పద్యములు

1 comments
మంగళాచరణమ్‌దిక్కాలాద్యనవచ్ఛిన్నానంత చిన్మాత్ర మూర్తయే । స్వానుభూత్యేక మానాయ నమః శాంతాయ తేజసే ॥ 1 తాత్పర్యము: త్రిలోకములూ, త్రికాలములూ, దశదిశలూ, అంతటా, అన్నిటా తానే అయి ఆత్మజ్ఞానుభవము చేత మాత్రమే గుర్తించదగిన జ్యోతిస్వరూప పరబ్రహ్మమునకు నమస్కారము. మూర్ఖపద్ధతిబోద్ధారో మత్సర గ్రస్తాః ప్రభవః స్మయ దూషితాః । అబోధోపహతాః చాన్యే జీర్ణమంగే సుభాషితమ్‌ ॥ అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః । జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి తం నరం న రంజయతి ॥ తాత్పర్యము:...
Read more...

Monday, 13 June 2011

పావులూరి మల్లన

0 comments
పావులూరి మల్లన తొలితరం తెలుగు కవి, గణితవేత్త. ఇతని కాలం స్పష్టంగా తెలియడంలేదు. ఇతను నన్నె చోడుని కాలం వాడని వాదాలున్నాయి. ఇతడు గణితసార సంగ్రహము అనె గణితగ్రంధాన్ని వ్రాశాడు. రాజరాజునుండి ఇతనికి నవఖండవాడ అగ్రహారం లభించిందట. తెలుగు పద్యానికి ఆరంభదశ అనుకొనే ఆ కాలంలోనే గణిత శాస్త్ర నియమాలను పద్యాలలో పొందుపరచడం సాధ్యమయ్యిందని ఇతని రచనల ద్వారాతెలుస్తున్నది. కాలంనాటివాడని, కాదు ఇతనిదని చెప్పబడుతున్న ఒక పద్యం శ్రీలలనేశు డాంధ్రనృపశేఖరుడై చను రాజరాజభూ- పలకుచేత బీఠపురి పార్శ్వమున న్నవఖండవాడ యన్ బ్రోలు విభూతితో బడసి భూరిజనస్తుతుడైన సత్కళా- శీలుడ రాజపూజితుడ శివ్వన పుత్త్రుడ మల్లనాఖ్యుడన్  గోదావరి...
Read more...

Sunday, 12 June 2011

హనుమాన్‌ చాలీసా పుట్టుక

2 comments
<a href='http://www.bidvertiser.com'>pay per click advertising</a తులసీదాసు రామభక్తుడు. నిరంతరం రామనామస్మరణలో, రామనామగానంలో మునిగి, బ్రహ్మానందం పొందేవాడు. ఆయనే కాదు, ఆ గానామృతానికి పరవశించిపోయిన అనేకమంది, తులసీదాస్‌ దగ్గరకు వచ్చి రామనామ దీక్ష తీసుకుని, నిరంతరం శ్రీరాముని స్మరిస్తూ ఆనందంలో ఓలలాడేవారు. కేవలం హిందువులే కాదు, ఇతర మతాలవారు కూడా తులసీదాస్‌ వద్ద...
Read more...

త్రైలింగస్వామి

0 comments
త్రైలింగస్వామి 1601వ సంవత్సరం లో ఆంధ్రదేశం లో జన్మించి సుమారు 280 సంవత్సరాలు జీవించిన మహాత్ముడు. వీరి తల్లిదండ్రులు నరసింగరావ్, విద్యావతి. స్వామి శివుడి అవతారంగా చెప్పబడ్డాడు. ఆయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరాం. స్వామి చిన్నప్పటినుండే మిగతా పిల్లల లాగ ఆటపాటలలో పాల్గొనకుండా ఎప్పుడూ ఏకాంతం కోరుకునేవాడు. తన తల్లి చెప్పే రామాయణ, మహాభారతాలు మొదలైన మతగ్రంథాలు ఎంతో ఆనందంగా వినేవాడు. ఇతను తన తల్లిదండ్రుల సేవలో 52 సంవత్సరాలు గడిపాడు. అప్పుడు తన...
Read more...

శివకేశవుల అభేదమును తెల్పు హరిహరనాధుని స్తుతితో తిక్కన భారతాన్ని ప్రారంభించాడు

0 comments
శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భ ద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి 'విష్ణు రూ పాయ నమశ్శివాయ' యని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్ధిక...
Read more...

భారతంలో నన్నయగారి చివరిపద్యం - శారదరాత్రుల వర్ణన

0 comments
శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్ జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరి పూరితంబులై ||శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. - అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనుపించటము లేదు - వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలి తో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి వంటి వెన్నెలను విరజిమ్ముతున్న...
Read more...

త్రిమూర్తులను వర్ణించు శ్లోకము

0 comments
రచన: నన్నయ్య  శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యేలోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాంతేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురైర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్శ్రేయసే...
Read more...

మనుచరిత్రలో సాయంకాల వర్ణన

0 comments
శా. శ్రేణుల్ గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు; లుష్ణాంశుపా     షాణ వ్రాతము కోష్ణమయ్యె; మృగతృష్ణావార్ధు లింకెన్; జపా     శోణం బయ్యెఁ బతంగ బింబము; దిశా స్తోమంబు శోభాదరి     ద్రాణం బయ్యె, సరోజషండములు నిద్రాణంబు లయ్యెం గడున్  ఆంధ్ర కవితా పితామహుడిగా పేరుపొందిన అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రము లోని తృతీయాశ్వాసం లోనిది ఈ పద్యం. ఇందులో కవి సాయంకాలాన్ని వర్ణిస్తున్నాడు. తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ చెరిగిపోని పేర్లలో అల్లసాని పెద్దన పేరు చాలా ముఖ్యమైంది. కృష్ణదేవ రాయని ఆస్థానం లోని అష్టదిగ్గజాలనే తెలుగు కవుల్లో పెద్దన అగ్రగణ్యుడు. రాయలవారికి...
Read more...

Tuesday, 7 June 2011

వెయ్యేళ్ళ తెలుగు పద్యం.

0 comments
మ. హరిదంభోరుహలోచన ల్గగనరంగాభోగరంగ త్తమో భర నేపథ్యము నొయ్య నొయ్య సడలింపన్, రాత్రి శైలూషికిన్ వరుసన్ మౌక్తికపట్టమున్, నిటలమున్, వక్తంబునుం దోఁచె నా హరిణాంకాకృతి వొల్చె రే కయి, సగం బై, బింబ మై తూర్పునన్. ఇది వసు చరిత్రలో రామరాజ భూషణుని చంద్రోదయ వర్ణన. వెయ్యేళ్ళ తెలుగు పద్యం పేరుమీదుగా ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో (1980 దశకంలో ) కీ.శే. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు నిర్వహించిన శీర్షికలోని తొట్టతొలి పద్యం. గగనరంగ మనే విశాల రంగస్థలం మీద రాత్రి అనే నట్టువకత్తె చూపించబోయే నాట్య ప్రదర్శనకు ముందుగా పద్మలోచనలు తాము పట్టుకున్న చీకటి అనే తెఱను మెల్లమెల్లగా సడలిస్తుండగా రాత్రి అనే...
Read more...

Monday, 6 June 2011

నవగ్రహ ధ్యాన శ్లోకములు

0 comments
శ్లో|| ఆరోగ్యం పద్మబన్ధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి:      భూలాభం భూమిపుత్రస్సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్య: |      సౌభాగ్యం దేవమన్త్రీ రిపుభయశమనం భార్గవశ్శౌర్యమార్కి:      దీర్ఘాయుస్సైంహికేయో విపులతరయశ: కేతురాచంద్రతారం || శ్లో|| అరిష్టాని ప్రణశ్యన్తు దురితాని భయాని చ |       శాన్తిరస్తు శుభం మేస్తు గ్రహా: కుర్వన్తు మంగళం |...
Read more...

Monday, 23 May 2011

శ్రీ నృసింహ విశిష్ట ధ్యాన శ్లోకములు

0 comments
 ౧]కర్ణభార అంతర్గతము  రచన: భాసకవి    శ్లో||  నర మృగపతి వర్ష్మా లోకనభ్రాంతనారీ       నర దనుజ సుపర్వ వ్రాత పాతాలలోక:       కరజ కులిశ పాలీ భిన్న దైత్యేంద్ర వక్షా:       సురరిపు బల హన్తా శ్రీధరోస్తు శ్రియేవ: ||   ౨] కోటగిరిలో చదివే ధ్యాన శ్లోకము: శ్లో||  గోఖండం వారమాండం పరివిరి విరిటం దర్పణాండం పరాండం      ...
Read more...

శ్రీసూర్య భగవాన్ ప్రార్థన

0 comments
            శా. ఈవే చండగభస్తి మండలముచే నింకింతు వంభోనిధుల్ ,                        నీవే విశ్వహితార్థమై కురియుదెంతే వాన మేఘాక్రుతిన్                        దీవే చేయుదు భస్మరాశిగ వనానీకంబు దావాగ్నివై,   ...
Read more...

Friday, 20 May 2011

తెలుగు చాటువులు

0 comments
"కవి సార్వభౌమ" శ్రీనాథ ప్రణీతము. శ్రీనాథమహాకవి చాటుపద్యాలకు ప్రసిద్ధి. ఆయన వ్రాసిన ఒకటి రెండు చాటువులనైనా చెప్పుకోకపోతే విషయానికి  సమగ్రత చేకూరదు. మచ్చుకి దిగువ కొన్ని పద్యాలూ అవధరించండి. సిరిగల వానికి చెల్లును తరుణుల పదారువేల పెండ్లాడంగా తిరిపెమున కిద్దరాండ్రా? పరమేశా, గంగ విడుము పార్వతి చాలున్‌  సున్నితమసస్కుడు.సౌందర్యారాధనే కాదు, స్త్రీల మనస్సుల్ని చదవగలిగిన వాడు శ్రీనాథుడు. ఈ ప్రేమలేఖను చూడండి - ఆయన నిర్మల హృదయాన్ని ఆవిష్కరిస్తుంది. శ్రీమదసత్య మధ్యకును జిన్ని వయారికి ముద్దులాడికిన్‌ సామజయానకున్‌ మిగుల జక్కని యింతికి మేలు గావలెన్‌ మేమిట క్షేమ మీవరకు మీ శుభవార్తలు వ్రాసి...
Read more...